Home తాజా వార్తలు టీమిండియాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం

టీమిండియాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం

 

న్యూఢిల్లీ: భారత క్రికెట్ చరిత్రలో కోహ్లీ సేన సరికొత్త  రికార్డు చ‌రిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగియడంతో 2-1 తేడాతో భారత్‌ చారిత్రక సిరీస్ విజయాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌ గెలవాలన్న దశాబ్దాల కల నెరవేరడంతో క్రికెట్‌, సినీ, రాజకీయ ప్రముఖులు కోహ్లీసేనపై ట్విటర్‌లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతోపాటు పలువురు క్రీడా ప్ర‌ముఖులు టీమిండియాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

 

Congratulations to Team Inida