Home జనగామ కెసిఆర్ తోనే బంగారు తెలంగాణ : ఎర్రబెల్లి

కెసిఆర్ తోనే బంగారు తెలంగాణ : ఎర్రబెల్లి

TRSజనగామ : సిఎం కెసిఆర్ పాలనలోనే బంగారు తెలంగాణ సాధ్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. దేవరుప్పుల మండలం, కడివెండి గ్రామానికి చెందిన కాంగ్రెస్, సిపిఐ నాయకులు టిఆర్ఎస్ సింగిల్ విండో డైరెక్టర్ రఫెల్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి ఎర్ర‌బెల్లి పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు నీలసర్ప ప్రభాకర్, మాజీ వార్డు మెంబర్ బిట్ల రామ చొక్కం, సిపిఐ  గ్రామ కార్యదర్శి సులుగూరి మహేష్, మహిళా కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షురాలు పైండ్ల యాకమ్మ, దరగాని దినేష్ తదితరులు టిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. కెసిఆర్ పాలన దేశానికే ఆదర్శంగా మారిందని ఆయన పేర్కొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించేలా పార్టీ కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని ఆయన కోరారు.

Congress and CPI Leaders Joins in TRS