Home తాజా వార్తలు విజయశాంతికి తృటిలో తప్పిన ప్రమాదం..

విజయశాంతికి తృటిలో తప్పిన ప్రమాదం..

Congress Election Campaign Stage Collapse in Achampet

మహబూబ్ నగర్: శుక్రవారం అచ్చంపేటలో జరిగిన కాంగ్రెస్ సభ లో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రచార వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, విజయశాంతి తృటిలో ప్రమాదం తప్పింది. పరిమితికి మించి ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా సభ వేదికపై రావవడంతో సభ వేదిక ఒక పక్కకు ఒరిగింది. వేదిక కూలిన ఘటనలో కాంగ్రెస్ నేతలు సురక్షితంగా బయటపడ్డారు. వేదిక కుప్పకూలడంతో  కాంగ్రెస్ నేతలంతా భయంతో ఘటనా స్థలం నుంచి పరుగులు తీశారు. ప్రచారసభకు హాజరైన వారిలో విజయశాంతి, భట్టివిక్రమార్క, నంది ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.