Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

CONGRESS

కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ 132వ ఆవి ర్భావ దినోత్సవాలను బుధవారం ఆ పార్టీ శ్రేణులు ఘనం గా జరుపుకున్నాయి. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి పరస్పరం పంచుకున్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆవి ర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతలకు బహుమతులను అందజే శారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు.

సోనియాగాంధీ, షబ్బీర్‌అలీల నాయకత్వంలో పార్టీని మరింత పటిష్టం చేసి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని విజయపథాన నిలుపుతామ న్నారు. ఈ వేడుకల సందర్భంగా స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో అండర్ -17 విభాగంలో కామారెడ్డి, నిజా మాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన స్థానిక సాందీపని కళాశాల విద్యార్థులకు కాంగ్రెస్ నాయకుల ట్రోఫిని అందజేశారు. విజేత జట్టును పూలమాలతో సన్మానించారు.  కాంగ్రెస్ పార్టీ నాయకులు యాద నాగేశ్వర్‌రావు, ఇసాక్ షెరూ, కన్నయ్య, చందు, కారంగుల అశోక్‌రెడ్డి, చింతల శ్రీను, కౌన్సిలర్ జమీల్, పంపరి శ్రీనివాస్, హరికిషన్‌గౌడ్, సందీప్, మెడికల్ రాజు, శ్రీధర్‌గౌడ్, విష్ణు, అంగడి బాబా, ముదాం రమేశ్, పిల్లి మల్లేష్, సురేశ్, రాకేశ్, సాయిబాబా, రాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments