Tuesday, April 23, 2024

కెఎల్ఆర్ ఇంటికి కాంగ్రెస్ కార్యదర్శులు..

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. కొత్త నేతల చేరికలను ప్రోత్సహిస్తూనే…సమర్ధవంతమైన నేతలకు జిల్లాల బాధ్యతలు కేటాయిస్తోంది. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలను రంగంలోకి దించుతోంది. పార్టీ గెలుపు కోసం ప్రజలను ప్రభావితం చేయగలగిన నేతలకు ప్రాధాన్యత ఇస్తుంది. రంగారెడ్డి జిల్లా తొలి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. అక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ తొలి నుంచి పార్టీ కోసమే పని చేస్తున్న కేఎల్ఆర్ ను పార్టీ గుర్తించింది. ఆర్థిక, అంగ బలం కలిగిన కేఎల్ఆర్ సేవలను పార్టీకి ఎన్నికల సమయంతో సహకరిస్తారనే అభిప్రాయానికి వచ్చింది. దీంతో, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు నేరుగా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రతీ నియోజకవర్గం పైన కేఎల్ఆర్ కు పట్టు ఉండటంతో ఆయనతో కీలక చర్చలు జరిపారు. ప్రతీ నియోజకవర్గం పైనా ఫోకస్ పెట్టాలని..పార్టీ శ్రేణులను ఎన్నికలకు సంసిద్దులను చేసేలా కార్యాచరణతో రంగంలోకి దిగాలని పార్టీ ముఖ్య నేతలు కేఎల్ఆర్ కు సూచించారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని కోరారు. దీంతో ఇప్పుడు కేఎల్ఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో పర్యటనలు ప్రారంభించారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోనూ మంచి పట్టు ఉన్న నేతగా కేఎల్ఆర్ కు గుర్తింపు ఉంది. దీంతో ముందుగా చేవెళ్ల అసెంబ్లీ పరిధిలోని పార్టీ కీలక నేతలతో సమావేశమైన కేఎల్ఆర్ తనకు పార్టీ అప్పగించిన బాధ్యతల అమలుకు రంగంలోకి దిగారు.

మేడ్చల్ పరిధిలో బోనాల వేడుకల్లోనూ పాల్గొన్న కేఎల్ఆర్, కార్యకర్తల్లో జోష్ నింపారు. దాదాపు వెయ్యి బైక్ లతో కేఎల్ఆర్ అభిమానులు బోనాల వేళ బైక్ ర్యాలీతో ఆహ్వానించారు. మేడ్చల్ తో పాటుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో ఇప్పుడు కేఎల్ఆర్ పార్టీకి ఇచ్చే నివేదికలు కీలకం కానున్నాయి. పార్టీ క్షేత్ర స్థాయి పరిస్థితి నుంచి ప్రతీ అంశం పైన కేఎల్ఆర్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. నిరంతరం హైకమాండ్ తో టచ్ లో ఉంటూ ఎన్నికల వేళ కీలకంగా మారారు. దీంతో, కేఎల్ఆర్ కేంద్రంగా రంగారెడ్డి కాంగ్రెస్ రాజకీయం నడుస్తోంది. కేఎల్ఆర్ నివాసానికి పార్టీ జాతీయ కార్యదర్శులు రావటం, బాధ్యతలు అప్పగించటంతో ఆ జిల్లా పార్టీ నిర్ణయాల్లో కేఎల్ఆర్ చక్రం తిప్పటం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో మేడ్చల్ ఎమ్మెల్యేగా పని చేసిన కేఎల్ఆర్ కాంగ్రెస్ నాయకత్వానికి విధేయుడిగా ఉన్నారు. బీఆర్ఎస్ తో పోటీ వేళ కీలకమైన రంగారెడ్డి జిల్లాలో కేఎల్ఆర్ కు ఉన్న పట్టుతో ఎన్నికల వేళ ఆయన సేవలను సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News