Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్

harish-ravu-image

కోర్టులలో కేసులు వేస్తూ దొంగ నాటకాలు
కాంగ్రెస్‌ది విధ్వంసం,టిఆర్‌ఎస్‌ది వికాసం
ప్రజా క్షేత్రంలో ప్రజలే బుద్ధి చెబుతారు
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు

మనతెలంగాణ/పెద్దపల్లి: కోర్టులలో కేసులు వేస్తూ కాళేశ్వరంతో సహ పలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నది కాంగ్రెస్ పార్టీనేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు రోపించారు. ఆదివారం పెద్దపల్లి జూనియర్ కళాశాల మై దానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు తు మ్మల నాగేశ్వరరావు,ఈటల రాpsందర్‌లతో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణలోని కోటి ఎకరాల మాగానికి నీళ్ల్లీచ్చేందుకు కాళేశ్వరం, పాలమూరు, సీతారామా ప్రాజెక్టులకు రూప కల్పన చేసి ముందుకు పోతుంటె జీర్ణించుకోలేని కా ంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. తా ము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదంటూనే భూసేకరణ, ప్ర జాభిప్రాయ సేకరణను అడుగడుడునా అడ్డుకుంటూ మొ సలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్‌కు ప్రజా క్షేత్రంలో ప్రజలే బుద్ధి తగిన చెబుతారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి దేశంలోని అనేక రాష్ట్రాలు మన ల్ని అనుసరిస్తున్నాయని అన్నారు. మిషన్ కాకాతీయ, మి షన్ భగీరథ, కళ్యాణలక్ష్మి,షాదిముబారక్,రైతుబంధు తదితర అభివృద్ధి, సంక్షేమ పథకాలను తమ తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి గుజరాత్,మహారాష్ట్ర,హర్యాన తదితర రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయని అన్నారు. తాజాగా జ రుగుతున్న కర్ణాటక శాసనసభ ఎన్నికలలో సైతం రుణమా ఫి కళ్యాణ లక్ష్మి మొదలగు పథకాలను అమలు చేస్తామని అక్కడి పార్టీలు వాగ్ద్దానాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా
ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు రాబోయె ఎన్నికలలో కాంగ్రెస్‌ను మట్టి కరిపించి,టిఆర్‌ఎస్‌ను దీవిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసి చైర్మెన్ సోమవరపు సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ప్రభుత్వ సలహదారు వివేక్,పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్, రామగుండం మేయర్ కొంకటి లక్ష్మినారాయణ,పెద్దపల్లి మున్సిపల్ మేయర్ రాజయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కోట
రాంరెడ్డి,జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మెన్ రఘువీర్ సింగ్,మార్కెట్ కమిటి చైర్మెన్ గుండేటి ఐలయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments