Search
Sunday 18 November 2018
  • :
  • :

రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే అధికారం:పరిగి ఎంఎల్‌ఎ

tentమన తెలంగాణ/నవాబ్‌పేట్:తెలంగాణా రాష్ట్రం లో రాబోవు 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానున్నదని పరిగి శాసనసభ్యులు రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం మండల పరిధిలోని నూతన విలీన గ్రామాల్లో ఆయన పలు అభివృద్ధ్ది కార్యక్రమాల శంఖుష్థాపనలో ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలతో కార్యక్రమాల ను ప్రారంభించారు,ముందుగా మండల పరిధిలో ని మరికల్‌లో రూ.5లక్షల కేటాయింపులతో ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేశా రు. తదనంతరం అదే గ్రామ పంచాయితీ అను బంధ గ్రామాలైన తంగెడిపల్లి,బంగ్రంపల్లిలలో మి నీ వాటర్‌ట్యాంకు పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ ఎన్నో అంచనాలతో అధికా రంలోకి వచ్చిన తెలంగాణా ప్రభుత్వం  సుపరిపా లనతో ప్రజలను సంతృప్తి పరచడంలో పూర్తిగా వి ఫలమైందని రాబోవు ఎన్నికలలో తెలంగాణా ప్ర జలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం ఖాయ మన్నారు.అలాగే గతంలో జరిగిన మండలాల పు నర్విభజనలో విడిపోయిన మరికల్, మల్కా పూర్, చాకల్‌పల్లి,కొత్తపల్లి,కన్మన్‌కాల్వ గామాలకు వీలై నన్ని ఎక్కువ నిధులను కేటాయించి పూర్తిస్థా యి లో అభివృద్ధ్ది చేస్తామని హామీనిచ్చారు.త్వరలో వి డిపోయిన గ్రామాలన్నీ పూర్వం వున్న పాత మం డలానికే తిరిగి కలుపడం ఖాయమన్నారు.పరిగి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకన్నా మరికల్ గ్రామమంటే తనకు ఎంతో ఇష్టమని,గ్రామంలో సమర్థవంతమైన నాయకులు ఎల్లప్పుడూ అభివృ ద్ధిని కోరుకునే విధానం తనకు నచ్చిందని నాయ కులను కొనియాడారు.జనాలకు ఎప్పుడు ఏ ఆప ద వచ్చిన తనను నిస్సందేహంగా సంప్రదిం చాల ని కోరారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఎతో పాటు స ర్పంచ్ కెతావత్‌రాజు, ఎంపిటీసి పాండురంగ య్య, ఉపసర్పంచ్ శేఖర్,నాయకులు చాకలపల్లి శేఖర్,వార్డుసభ్యులు డంగు నర్సిములు, నర్సింహా రెడ్డి,వీరారెడ్డి,రామ్మోహన్ ర్మ,కృష్ణాచారి,నరేందర్ ప్రసాద్,కృష్ణాజీ,డంగు శ్రీను,అర్షద్‌అలీ,ఇంటోళ్ల రవి,అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు, రాజూయాదవ్,శ్రీశైలం యాదవ్  పాల్గొన్నారు.

Comments

comments