Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్ నేత గురుదాస్ కామత్ కన్నుమూత

Congress Leader Gurudas Kamat Passes Away

ఢిల్లీ : మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత గురుదాస్ కామత్ (63) బుధవారం ఉదయం కన్నుమూశారు. కామత్‌కు గుండెపోటు రావడంతో ఇక్కడి ప్రీమూస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కామత్ మృతిపై జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, రాజస్థాన్ మాజీ సిఎం అశోక్ గెహ్లాట్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కామత్ గతంలో ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. కాంగ్రెస్ ఓ గొప్ప నేతను కోల్పోయిందని అశోక్ గెహ్లాట్ ఆవేదన వ్యక్తం చేశారు. కామత్ మృతి కాంగ్రెస్ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన పేర్కొన్నారు.

Congress Leader Gurudas Kamat Passes Away

Comments

comments