Home జగిత్యాల ప్రజలను వంచిస్తున్న ప్రభుత్వం

ప్రజలను వంచిస్తున్న ప్రభుత్వం

MLA T Jeevan Reddy

* బడ్జెట్ విలువలను కాలరాస్తున్నారు
* అల్ప సంఖ్యాక వర్గాల అభివృద్ధిని మరిచారు
* డబుల్‌బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలపై
శ్వేతపత్రం విడుదల చేయాలి
* సిఎల్‌పి ఉపనేత జీవన్‌రెడ్డి

జగిత్యాల: ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే బతుకులు బాగుపడతాయని ఆశపడి ప్రజలు టిఆర్‌ఎస్‌కు ఓట్లేసి అధికారం కట్టబెడితే తెలంగాణ ప్రభుత్వం ప్రజలను వంచిస్తోందని సిఎల్‌పి ఉపనేత, జగిత్యాల ఎంఎల్‌ఎ తాటిపర్తి జీవన్‌రెడ్డి విమర్శించారు. జగిత్యాలలోని ఆయన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రణాళిక వ్యయం బడ్జెట్‌లో పేర్కొని దానికి అనుగుణంగా పనులు చేపట్టాల్సి ఉండగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. బడ్జెట్ విలువలను పూర్తిగా కాలరాస్తోందని, అల్పసంఖ్యాక వర్గాల అభివృద్దిని గాలి కొదిలేసిందని ఆయన విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం కోట్లాది నిధులు వెచ్చిస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటోందని, కేవలం పెన్షన్లు పంపిణీ మాత్రమే సంక్షేమం అని భావించడం ప్రభుత్వానికి తగదన్నారు.

బడ్జెట్‌లో ఎస్ సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపుకు అనుగుణంగా ఖర్చు చేయాలని చట్టబద్దత కల్పించుకుంటే ఈ మూడేళ్లలో ఆ నిధుల్లో సగం మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధులను ఖర్చు చేయడంలో విఫలమైన ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదన్నారు. బి సి సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయించిందని, ఆ ని ధులు ఏ మూలకు సరిపోవన్నారు. గొర్రెల కాపరులకు ఈ ఏడాది ప్రభుత్వం పేర్కొన్న విధంగా గొర్రెల యూనిట్లు పం పిణీ చేస్తే వాటికి రూ.2వేలకోట్లు ఖర్చవుతాయని, లబ్ధి దారుడి వాటా 25 శాతంగా రూ.500 కోట్లు పోగా మిగతా 1,500 కోట్లు వెచ్చించాల్సి వస్తుందన్నారు. రూ.5 వేల కో ట్లలో గొర్రెల కాపరులకే రూ.1,500 కోట్లు పోతే మిగతా రూ.3,500 కోట్లు బిసి సంక్షేమానికి ఎలా సరిపోతాయని జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మైనార్టీ సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఉర్దూ అ కాడమీలో పనిచేస్తున్న వారికి గత మూడు నెలలుగా వేత నాలు చెల్లించడం లేదని, ఇదేనా మైనార్టీ సంక్షేమం అని ఆ యన దుయ్యబట్టారు.

అందరికీ విద్యనందించాలనే ఉద్దేశంతో అనాటి ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తీసుకువస్తే కెసిఆర్ అందరికీ విద్యను అందని ద్రాక్షే చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కెజి నుంచి పిజి వరకు ఉచిత నిర్భంధ విద్యను అమలు చేస్తామని చెప్పి మూడేళ్లు గడిచినా అతీగతీ లేదన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు కెజి నుంచి పిజి ఆంగ్లమ విద్యకు ప్రత్యామ్నాయం కానే కాదన్నారు. 0 నుంచి 4వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదివి 5వ తరగతికి ఆంగ్లమాధ్యమంలో చేరిన విద్యార్థులు 0-5 వరకు ఆంగ్ల మాధ్యమంలో చదివిన విద్యార్థులతో ఎలా పోటీ పడతారని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. విద్యా హక్కు చ ట్టాన్ని కనీసం 0-4 చదివే విద్యార్థులకైనా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు చే పట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

నిరుద్యోగం పెరిగిపోయి యువత నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ ర్పడితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆశపడి విద్యార్థులు, నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమాన్ని భుజా నికి ఎత్తుకున్నారని, తెలంగాణ పోరాటంలో ముందు నిలి చిన వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన ప్ర భుత్వం వారి భవిష్యత్తును బుగ్గి చేస్తోందన్నారు. రాష్ట్రం లోని విద్యార్థులకు ఫీజు రిఎంబర్స్‌మెంట్ కోసం రూ.4 వేల కోట్లు అవసరం ఉండగా ఈ యేడాది కేవలం రూ.1,339 కోట్లు మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు. రెం డేళ్ల క్రితమే ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో 1.07 లక్షల కోట్ల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారని, ఈ రెం డేళ్లలో మరో 50 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయడంతో ఆ సంఖ్య 1.57 లక్షలకు చేరిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 6 వేల ఉద్యోగాలు మాత్రమే కల్పించి 27 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పు కోవడం శోచనీయమన్నారు.

కెసిఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని, ప్రశ్నించే వారిని అణగదొక్కేందుకు రోజు రోజుకు పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. మహిళలకు ప్రసూతి సాయంగా రూ.12వేలు అందించడం హర్షనీయమని, గతంలో ఆడపిల్లల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకాన్ని కూడా కొనసాగిస్తే ఆడపిల్లలకు మేలు జరుగుతుందన్నారు. బడ్జెట్ సందర్భంగా టిఆర్‌ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పాలాభిషేకం చేస్తున్నారని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చితే తాము కూడా కెసిఆర్‌కు పాలాభిషేకం చేస్తామని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. డబుల్‌బెడ్ రూం ఇండ్లు ఇస్తామని ఊరిస్తున్న ప్రభుత్వం, గృహనిర్మాణ శాఖ మంత్రి స్వంత నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు ఒక్క ఇళ్లు కూడా నిర్మించలేదన్నారు.

డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలపై నియోజకవర్గాల వారీగా ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతాంగం, వ్యవసాయం కోసం గత ప్ర భుత్వాలు ధరల స్థిరీకరణ కోసం ఏర్పాటు చేసిన పద్దు ఏమైందని ప్రశ్నించారు. పత్తి పంటకు బదులు కంది సాగు చేయాలని చెప్పిన ప్రభుత్వం అటు పత్తి రైతులను, ఇటు కంది రైతులకు అ న్యాయం చేసిందన్నారు. రైతుల రుణాలను ఏక కాలంలో మాఫీ చేయకపోవడం వల్ల వడ్డీ పెరిగిపోయిందని ఈ మూడేళ్ల వడ్డీ భారాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. ప్ర భుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను న్యాయస్థానాలు త ప్పుపడుతూ మొట్టికాయలు వేస్తున్నా పద్దతి మార్చుకోక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొత్త మో హన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, బండ శంకర్, దామోదర్‌రావు, అయిలవేని గంగాధర్, గంగం మ హేశ్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.