Home తాజా వార్తలు కెసిఆర్ అవినీతికి వనరుగా మెట్రో రైలు ప్రాజెక్టు: రేవంత్

కెసిఆర్ అవినీతికి వనరుగా మెట్రో రైలు ప్రాజెక్టు: రేవంత్

CBI Enquiry on Electricity Corruption

హైదరాబాద్: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి సిఎం కెసిఆర్‌పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టను కెసిఆర్ అవినీతికి వనరుగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. మెట్రో ప్రాజెక్టును చేపట్టిన ఎల్ అండ్ టి యాజమాన్యం రూ. 1200 కోట్ల విలువైన ఆస్తులను ముఖ్యమంత్రి బినామీ సంస్థకు కేవలం రూ. 250 కోట్లకే అప్పగించారని ఆరోపించారు. మెట్రోలో చోటుచేసుకున్న అవినీతిని ప్రశ్నించకుండా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసితో కెటిఆర్ రహస్య చర్చలు జరిపారని చెప్పారు. తాను చేస్తున్న ఆరోపణలు నిజం కాకపోతే దీనిపై వెంటనే విచారణకు ఆదేశించాలని సవాల్ చేశారు.