Home తాజా వార్తలు దానికోసం పగటి కలలు కంటున్న కాంగ్రెస్ నేతలు

దానికోసం పగటి కలలు కంటున్న కాంగ్రెస్ నేతలు

Jagadesh-Reddy1

నల్గొండ: అభివృద్ధిపై చర్చకు ఎప్పుడైనా తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైనా చర్చకు వస్తారా అని మంత్రి జగదీశ్ రెడ్డి సవాలు విసిరారు. డిండి ప్రాజెక్ట్ నుంచి మంత్రి జగదీశ్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  డిండి ప్రాజెకట్ కింద రైతాంగం చాలా సంతోషంగా ఉందని వివరించారు. కాంగ్రెస్ వాళ్లు పది జన్మలు ఎత్తినా డిండి కింద ఖరీఫ్‌లో నీళ్లు ఎవ్వలేరని ఎద్దేవా చేశారు. రైతులను లాఠీలతో కొట్టించిన ఘనత కాంగ్రెస్‌దని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతల చేతకానితనం వల్లనే నల్లగొండ జిల్లా వెనకబడ్డదని మండిపడ్డారు. కరెంటు విషయంలో సిఎం కెసిఆర్ అద్భుతం చేసి విజయం సాధించారని, కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు నిద్రపట్టడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. కెసిఆర్‌ను ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఉత్తమ్, జానాకు లేవన్నారు. ప్రజల బాధలు, కష్టాలు తెలిసిన కెసిఆర్ ఎవరు అడగకుండానే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల హృదయాల్లో నిలిచారని మంత్రి పొగిడారు.