Search
Sunday 22 July 2018
  • :
  • :

నిరుద్యోగ చైతన్య యాత్రకు కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ

Congress leaders Going To the open house in thorruru

దేవరుప్పుల ః రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తలపెట్టిన నిరుద్యోగ చైతన్య యాత్రకు మండలంలోని పలు గ్రామాల యూత్ కాంగ్రెస్ నాయకులు భారీగా తరలి వచ్చారు. గురువారం తొర్రుర్ మండలంలో జరగనున్న బహిరంగ సభకు మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మండల పరిషత్ కార్యలయం నుండి తెలంగాణ కూడలి వరకు బైక్ ర్యాలీ తీసి తొర్రూర్ నిరుద్యోగ చైతన్య యాత్రకు బయలు దేరారు. మొదట మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పల సురేష్‌బాబు కాంగ్రెస్ పార్టీ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నియమాల కోసం సాధించుకున్న తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించలేక కాలయాపన చేస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే నిరుద్యోగ యువతకు ఉపాధి లబించిందన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంగ అర్జున్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొనగిరి యాకస్వామి, మండల కాంగ్రెస్ నాయకులు పెద్ది కృష్ణమూర్తి, ఎర్రయ్య, శ్రీరాములు, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments