Home తాజా వార్తలు రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన ప్రముఖులు

రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన ప్రముఖులు

Rajiv-Gandhi

ఢిల్లీ: మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు వీర్‌భూమి వద్ద నివాళులు అర్పించారు.   సోమవారం ఉదయం  ఢిల్లీలోని ఆయన సమాధి వీర్‌భూమి వద్ద  రాజీవ్ సతీమణి సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ఆయన కుమారుడు రాహుల్ గాంధీతో పాటు.. కుమార్తె ప్రియాంకా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లు  పుష్పగుచ్ఛాలు ఉంచి  నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులర్పిస్తున్నారు.