Home తాజా వార్తలు టిఆర్‌ఎస్ లో పలువురు చేరిక

టిఆర్‌ఎస్ లో పలువురు చేరిక

Congress Leaders Joins in TRS
చెన్నారావుపేట : మండలంలోని బాపునగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ గుగులోతు వెంకన్నతోపాటు 30 మంది కాంగ్రెస్‌పార్టీకి రాజినామ చేసి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పార్టీలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం వలనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి బోడా బద్దునాయక్, సర్పంచ్ మంగమ్మ, మాజి సర్పంచ్ రమేష్, గ్రామపార్టీ అధ్యక్షులు వీరన్న తో పాటు పలువురు పాల్గోన్నారు.

 

Congress Leaders Joins in TRS