Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

బతుకమ్మ చీరల కొనుగోళ్లలో భారీ కుంభకోణం

Leaders

నాణ్యతలేని చీరలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం
నిరసన తెలిపే మహిళలపై కేసులు అవివేక చర్య
సిరిసిల్ల నేత వస్త్రాలు ఎక్కడ విక్రయించారో కెటిఆర్ చెప్పాలి
టీపిసిసి ఎస్‌సి సెల్ అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ డిమాండ్

మానకొండూర్: ప్రభుత్వం రూ.222 కోట్లతో కొనుగోలు చేసిన బతుకమ్మ చీరల్లో భారీ కుంభకోణం జరిగిందని, తెలంగాణ ఆడబిడ్డలకు సిరిసిల్ల నేతన్నలు నేచిన చీరలను పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాటపై నిలబడకుండా, సూరత్ నుంచి నాణ్యతలేని చీరలను తీసుకొచ్చి పంపిణీ చేయడం సిగ్గు చేటని మానకొండూర్ మాజీ ఎంఎల్‌ఎ, టిపిసిసి ఎస్‌సి సెల్ అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మానకొండూర్ మండలం అన్నా రం గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోహన్ మాట్లాడుతూ ఆడబిడ్డలకు నా ణ్యత లేని చీరలు పంపిణీ చేసి సిఎం కెసిఆర్ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని విమర్శించారు. మహిళలు ప్రభుత్వ వైఖరిపై వివిధ రూపాల్లో నిరసనలు తెలు పుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తె లిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, నిరసన తెలుపు తున్న వారిపై ప్రభుత్వం కేసులు పెట్టడం అవివేకమైన చర్య అని, వెంటనే అక్రమ కేసులను ఎత్తివేయాలని మో హన్ డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఐటి, పంచాయితీరాజ్, చేనేత, జౌళిశాఖ మంత్రి కెటిఆర్ నియోజకవర్గాల్లో సైతం మహిళలు నాణ్యత లేని చీరల పంపిణీపై పెద్దఎత్తున నిరసనలు తెలిపార న్నారు. సిరిసిల్ల నేతన్నలు నేచిన చీరలు ప్రభుత్వం ఎక్కడ విక్రయించిందో ప్రజలకు తెలుపాలని డిమాండ్ చేశారు.

రూ.55కు ఒక చీరను కొనుగోలు చేసి, రూ. 211అని ప్రభుత్వం చెబుతున్నదని,చీరల కొనుగోళ్ల లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేసిన గ్రామాలలో లబ్ధిదారులు భూములను సాగు చేసుకుంటున్నా పంటలు పండటం లేదని తెలిపారు. సాగుకు పనికిరాని భూమిని పంపిణీ చేసి, దళితులను ఖర్చుల పాలు చేసిన అధికారులపై కేసులు పెట్టాలని అన్నారు. ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టిలపై నిరంకుశత్వం గా వ్యవహరిస్తున్నదని, అందుకు భూపాలపల్లి అటవీ ప్రాంతంలో గిరిజనులపై జరిగిన పాశివిక దాడులే నిద ర్శనమన్నారు. గిరిజన శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉన్న జిల్లా లోనే గిరిజనులపై దాడులు జరగడం హేయమైన చర్య అన్నారు. సింగరేణి వారసత్య ఉద్యోగాలు, జిఓ 39 పై టీఆర్‌ఎస్ నేతలే కోర్టుల్లో రిట్‌లు వేస్తూ ప్రజలను త ప్పుదోవపట్టిస్తున్నారని మోహన్ ఆరోపించారు. కాం గ్రెస్‌పై నిందలు మోపుతూ కెసిఆర్ పబ్బం గడుపు తున్నాడని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అన్నారం సర్పంచ్ ఆరెల్లి సంపత్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి జా గిరి రమేశ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పులి కృష్ణ, గసిగంటి సంపత్, బందెల మహేందర్, మే డి శ్రీనివాస్, మొల్గూరి శంకర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

comments