Home జాతీయ వార్తలు బిజెపిలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే

బిజెపిలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే

Prakash Chandra Beheraకటక్ : ఒడిశాలో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాలెపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంఎల్ఎ ప్రకాశ్ చంద్ర బెహెరా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.  20 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్న ప్రకాశ్ చంద్ర శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాశ్ చంద్రకు కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని  నరేంద్రమోడీ నాయకత్వంలో పనిచేసేందుకు తాను బిజెపిలో చేరినట్టు ప్రకాశ్ చంద్ర బెహరా తెలిపారు. ప్రకాశ్ చంద్ర బెహరా చేరిక ఒడిశాలో బిజెపి బలోపేతానికి ఎంతో ఉపకరిస్తుందని కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పాక్ లో భారత్ జరిపిన సర్జికల్ దాడులు దేశ ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపాయని  ప్రకాశ్ చంద్ర బెహరా పేర్కొన్నారు. రాష్ట్రంలో బిజెపి బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Congress MLA Prakash Chandra Behera Joins BJP