Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

నేడు టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్న కాంగ్రెస్ ఎంఎల్‌సి దామోదర్‌రెడ్డి

Congress MLC Damodar Reddy will be getting TRS Tirth

కాంగ్రెస్ పెద్దల పద్ధతి బాగలేకే టిఆర్‌ఎస్‌లో చేరుతున్నా
కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం లోపించింది
టిఆర్‌ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయంగా భావించాను
ఎంఎల్‌సి కూచకుళ్ల దామోదర్‌రెడ్డి

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి :  ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జడ్‌పి చైర్మ న్,  ఎంఎల్‌సి కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ఎట్టకేలకు శనివారం సాయంత్రం  ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.  ఈ సం దర్భంగా మన తెలంగాణ ప్రతినిధితో దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ కాం గ్రెస్ పార్టీకి తాను సుదీర్ఘంగా సేవలందించానని, అప్పట్లో బలమైన నాయకుడిగా ఉన్న ప్రతిపక్ష నాయకుడిని ఎదుర్కొని పార్టీని నిలబెట్టామన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటూ తన సొంత నిధులను వెచ్చించి పార్టీని ముందుకు నడిమాపామని అలాంటిది తనను సంప్రదించకుండానే నాగం జనార్థన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపానికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొందరు పెద్దలుగా చలామణి అవుతూ బ్రష్టుపట్టించారని, ఈ తరుణంలో టిఆర్‌ఎస్ పార్టీని ప్రత్యామ్నాయంగా భావించి  కెసిఆర్ సారథ్యంలో తానుకూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే లక్షంతో టిఆర్‌ఎస్‌లో చేరుతున్నామన్నారు. తనతోపాటు తన క్యాడర్ మొత్తం పార్టీలో చేరుతున్నారని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకరిద్దరు ప్రజా ప్రతినిధులు వారివారి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమతో రాకపోయినా ఇబ్బంది లేదని, వారిని మాత్రం తాను బలవంతం పెట్టడం లేదన్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పార్టీ గెలుపే లక్షంగా ముందుకు సాగుతామన్నారు. స్థానికంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా కొనసాగుతున్న తనను సంప్రదించడ కుండా తన స్వార్థం కోసం పూటకో పార్టీ మారుస్తూ, తన స్వార్థం కోసం ఉద్యమ పార్టీలను నిర్మిస్తూ విలీనం చేసే నాగం జనార్ధన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్షంగా పని చేస్తామన్నారు. రాజకీయంలో ఆత్మసంతృప్తి ముఖ్యమని తాను భావిస్తానని ఆయన అన్నారు.  శనివారం సాయంత్రం పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైందని దాదాపుగా ప్రగతి భవన్‌లోనే ఈ కార్యక్రమం ఉండవచ్చని దామోదర్‌రెడ్డి తెలిపారు.

Comments

comments