Home సూర్యాపేట కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి

కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి

Congress Party Preparation For 2019 Elections In Suryapet
మన తెలంగాణ/సూర్యాపేట : తిప్పే హేమాహేమీలు జిల్లాలో పోటీ చేస్తుండడంతో గెలుపోటములపై అప్పుడే అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో టికెట్ల గోలపై మన తెలంగాణ ప్రత్యేక కథనం.
ముందస్తు ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం ఉన్న నేపద్యంలో కాంగ్రేస్ పార్టీ భారీ కసరత్తు చేస్తున్నారు సూర్యాపేట జిల్లాలో కాంగ్రేస్ అగ్రనాయకులు ఉండటంలో కార్యకర్తల్లో నూతన ఉత్తేజం కనబడుతుంది ప్రభుత్వ తప్పిదాలపై సమర శంఖం పూరిస్తునే ప్రజలతో మమేకమవుతున్నారు. సూర్యాపేట ,తుంగతుర్తిలలో టి.ఆర్.ఎస్ శాసనసభ్యులు,హుజుర్‌నగర్ ,కోదాడలలో కాంగ్రేస్ శాసనసభ్యులు ఉన్నారు జిల్లాలో కాంగ్రేస్ టి.ఆర్.ఎస్ బలంగానే కన్పిస్తున్నాయి. కాంగ్రేస్‌కు బలమైన నాయకులు కార్యకర్తలు ఉండటంతో కలిసోచ్చే అవకాశాలే కన్పిస్తున్నాయి. కాంగ్రేస్ పార్టీకి అనాదిగా ఉన్న వర్గాలు చేదోడు వాదోడుగ ఉండటం,పార్టీకి వోటు బ్యాంక్ ఉండటం ప్రభుత్వ వ్యతిరేకతతో పార్టీలో ఊపు కనబడుతున్నది ఇటివలనే జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు పటేల్ రమేష్‌రెడ్డి చేరికతో సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రేస్ అమాంతం పుంజుకుంది. మాజీ శాసనసభ్యుడు మాజీమంత్రి రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా చుట్టుముట్టి వస్తున్నారు. సమావేశాలు సభలతో పార్టీలో హూషార్ రేకెత్తిస్తున్నారు. బలమైన నేత పటేల్ కాంగ్రేస్‌లో చేరడంతో ఇంకా పార్టీ జోరుమీద కనబతున్నది. దామోదర్, పటేల్ కల్సి గామ్రాల్లో తిరుగుతు పార్టీని పటిష్టం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపద్యంలో టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించారు. అగ్రనేత కావడంతో దామోదర్‌కే టికేట్ ఖాయమని ఆయన అనుచరులు పేర్కోంటున్నారు. కేంద్రనాయకత్వంలో నేరుగా సంబంధాలు ఉన్నందున దామన్నకే టికెట్ వచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు పేర్కోంటున్నారు. రేవంత్‌రెడ్డి హమీతోనే కాంగ్రేస్‌లో పటేల్ చేరినట్టు ఆయన వర్గీయులు పేర్కోంటున్నారు. రాహుల్‌గాంధీ టికేట్ తమ నేతకే ఇస్తానని చెప్పారని రమేష్‌రెడ్డి వర్గీయులు పేర్కొంటున్నారు. రెండు వర్గాలు కల్సి పని చేస్తున్నా ఎవరికీ వారే ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. పార్టీ అధిష్టానం ఈ ఇద్దరిలో ఒకరికి సూర్యాపేట శాసనసభ, మరొకరికి నల్గొండ పార్లమెంట్ నుండి పోటీ చేయించే అవకాశాలపై పార్టీ నిశితంగా పరిశీలిస్తున్నాదని పరిశీలకులు పేర్కోంటున్నారు.

కోదాడలో ఉత్తమ్ పద్మావతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తు పార్టీ అభివృద్దికి కృషిసల్పుతున్నారు. కాంగ్రేస్‌లోని హేమాహేమిలు టి.ఆర్.ఎస్ లోకి వెళ్ళినా కార్యకర్తల అండదండలతో హూషారుగా పర్యటిస్తూ జోష్ నింపుతున్నారు. కోదడ శాసనసభ కాంగ్రేస్ పార్టీ అభ్యర్ధిగా దాదాపు పద్మావతి పేరుఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక హుజూర్‌నగర్ నుండి పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి అభ్యర్ధి బిజీగా ఉన్నప్పటికి నేతలతో కార్యకర్తలతో సంబందాలు పెట్టుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండటం, పద్మావతి నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతుండటంతో కార్యకర్తలు మంచి జోష్‌లో ఉన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో గుడిపాటి నర్సయ్య పార్టీ అభివృద్ధికి కృషి సల్పినప్పటికి పార్టీ అప్పటి జె.ఎసి నేత అద్దంకి దయాకర్‌కు పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. నేడు వడ్డేపల్లి రవి పేరు తెరపైకి వచ్చింది. మాజీమంత్రి దామోదర్‌రెడ్డి అందదండలతో నియెజకవర్గ వ్యాప్తంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గోంటు ప్రజల్లో మమేకమై తిరుగుతున్నారు. కాంగ్రేస్ టికెట్ నాకే ఇస్తారంటు ప్రచారం సాగిస్తున్నప్పటికి అద్దంకి దయాకర్ అధిష్టాన అండదండలతో టికేట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఇక ప్రజల సమస్యలపై నిత్యం గళమెత్తే అన్నెపర్తి జ్ఞానసుందర్ కూడా ఎఐసిసి నాయకుల అండదండలతో టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. జిల్లాల్లో కాంగ్రెస్ జోరుమీద ఉన్నప్పటికి టికేట్ల గోల స్పష్టంగా కన్పిస్తున్నది. ఆశావాదుల జాబితా పెద్దదిగా ఉండే పరిస్ధితులు నెలకొన్నాయి. అయినను కాంగ్రెస్ మార్క్ రాజకీయం ఎలా ఉంటుందన్న దానిపైనే జిల్లా అంతటా అప్పుడే చర్చలు వాదోపవాదాలు జరుగుతున్నాయి.ఈ నేపద్యంలోనే బిసి ల వాయిస్ వినబడున్నది. బలహీన వర్గాల వారికి ఒక టికెట్ ఇవ్వాలనే డిమాండ్ నెలకొన్నది. అలాగే కోదాడలో బలమైన సామాజిక వర్గం కమ్మ వారి నుండి కూడ డిమాండ్ వస్తున్నది. మొత్తానికి కాంగ్రెస్‌లో టికెట్ల గోల ఇప్పటికే తారాస్థాయికి చేరింది. గెలుపుగుర్రాలకు టికెట్లు గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది. పార్టీ అధిష్టానం ఎవరికీ టికెట్ ఇచ్చి బరిలో నింపుతుందో వేచిచూడాల్సిందే.