Home తాజా వార్తలు డబ్బున్న వారికే టికెట్లు ఇచ్చారు: పొంగులేటి

డబ్బున్న వారికే టికెట్లు ఇచ్చారు: పొంగులేటి

Ponguleti Sudhakar Reddy Speech

 

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని తప్పనిసరి పరిస్థితుల్లో వీడుతున్నానని మాజీ ఎంఎల్‌సి పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాల పట్ల పొంగులేటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు.  ఎంపి సీట్ల కేటాయింపులలో కాంగ్రెస్ పార్టీలో డబ్బున్న వారికే ఇచ్చారని ఆరోఫణలు చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ తనకు ఇచ్చిన అవకాశాలకు థ్యాంక్స్ చెప్పారు. ఉగ్రవాదంపై కాంగ్రెస్ నేతలు మాట్లాడిన తీరు సరైంది కాదని మండిపడ్డారు. మోడీ మళ్లీ ప్రధాని కావటం ఖాయమని జోస్యం చెప్పారు. పిఎం నరేంద్ర మోడీ చేసే అభివృద్ధి పనులేకాక ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుండడంతో బిజెపి పార్టీలో చేరుతున్నానని పొంగులేటి ప్రకటించారు.  

 

Congress Sale MP Tickets to Rich Persons in Telangana