Home తాజా వార్తలు ‘కెసిఆర్ మూడో ఫ్రంట్ రెండు రోజుల ముచ్చటే’

‘కెసిఆర్ మూడో ఫ్రంట్ రెండు రోజుల ముచ్చటే’

Congress Senior Leader Ponnala Lakshmaiah Comments on Third Front

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకై సిఎం కెసిఆర్ థర్డ్ ఏర్పాటు కోసం చకచక పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే కెసిఆర్ రెండు రోజుల తమిళనాడు పర్యటనకు వెళ్లారు. ఇప్పటికే ఈ విషయమై పలువురు ప్రముఖ రాజకీయ నేతలతో కెసిఆర్ భేటీ అయ్యారు. ఇదిలాఉండగా సిఎం కెసిఆర్ మూడో ఫ్రంట్ రెండు రోజుల ముచ్చటేనని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికే కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. కాంగ్రెసేతర ఫ్రంట్ కష్టమని సిపిఎం, డిఎంకె, బిజెడి ఎప్పుడో చెప్పాయని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ సర్కార్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల్లో మితిమీరిన అవినీతి జరుగుతుందని, కెసిఆర్ దమ్ముంటే విచారణ జరిపించాలని పొన్నాల సవాల్ చేశారు.