Home తాజా వార్తలు డ్రంక్ అండ్ డ్రైవ్.. పట్టుబడ్డ కాంగ్రెస్ నేత కుమారుడు

డ్రంక్ అండ్ డ్రైవ్.. పట్టుబడ్డ కాంగ్రెస్ నేత కుమారుడు

Congress Leader son caught in Drunk and drive: Jubleehills

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో పోలీసులు శుక్రవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి కుమారుడు సిద్ధార్థ్ పట్టుబడ్డాడు. మద్యం తాగి వాహనం నడపడంతో సిద్ధార్థ్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిన్న రాత్రి ట్రాఫిక్ పోలీసులు జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాల్లో చేపట్టగా అదే సమయంలో మల్లు రవి కుమారుడు సిద్ధార్థ్ టిఎస్ 09 ఇఆర్ 7777 నంబర్ గల కారులో వచ్చాడు. దీంతో పోలీసులు అతడి వాహనాన్ని ఆపి, బ్రీత్ అనలైజింగ్ టెస్టు నిర్వహించగా మోతాదుకు మించి మద్యం తాగినట్లు తేలింది. దాంతో పోలీసులు  సిద్ధార్థ్‌ వాహనాన్ని స్వాధీనం  చేసుకుని అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.