Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

మేఘాలయకు కాంగ్రెస్ సీనియర్స్

Congress

షిల్లాంగ్ : మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళుతోంది. ఇప్పటికే ఐదు స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మరో 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే, ఇతరులతో పొత్తు అవసరంగా కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు చర్చలు చేసేందుకు కాంగ్రెస్ తమ పార్టీ అగ్రనేతలు అహ్మద్ పటేల్, కమల్‌నాథ్‌లను షిల్లాంగ్‌కు పంపించింది. ఇండిపెండెంట్లతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. గత పదేళ్లుగా మేఘాలయలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే, ఇక్కడ కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టినట్టే. ఈ రాష్ట్రంలో 60 సీట్లు ఉండగా, 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇదిలా ఉండగా ఈ రాష్ఠ్రంలో అధికారంలోకి రావాలని బిజెపి చూస్తోంది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో బిజెపికి మెజార్టీ లేనప్పటికీ, ఎన్‌పిపి, యుడిపిలతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాలో బిజెపి ఉంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ ఆశలు ఏమేరకు నెరవేరుతాయో వేచి చూడాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Congress Seniors for Meghalaya

Comments

comments