Home జాతీయ వార్తలు జయనగర్ కాంగ్రెస్‌దే…

జయనగర్ కాంగ్రెస్‌దే…

Congress’ Sowmya Reddy wins in Jayanagar constituency By-poll

బెంగళూరు: కర్నాటకలోని జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యా రెడ్డి స్వల్ప మెజారిటీతో గెలిచారు. సౌమ్యారెడ్డికి 54,045 ఓట్లు రాగా, బిజెపి అభ్యర్థి ప్రహ్లాద్ కు 50,270 ఓట్లు వచ్చాయి. దీంతో సౌమ్యా రెడ్డి  4 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బిజెపి అభ్యర్థి బిఎన్ విజయ్‌కుమార్ ఎన్నికల ప్రచారంలో గుండెపోటుతో మృతి చెందడంతో జయనగర్ నియోజకవర్గం ఎన్నికలు వాయిదా పడిన విషయం విదితమే. దాంతో జయనగర్ నియోజకవర్గానికి ఈ నెల 11న ఎన్నికలు జరగగా, బుధవారం కౌటింగ్ జరిగింది. ఈ విజయంతో కాంగ్రెస్ ఖాతాలో 80 స్థానాలు చేరాయి.