Home తాజా వార్తలు గుజరాత్‌లో కాంగ్రెస్‌దే విజయం : అహ్మద్ పటేల్

గుజరాత్‌లో కాంగ్రెస్‌దే విజయం : అహ్మద్ పటేల్

PATEL

బరూచ్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 110 స్థానాల కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ అగ్రనేత అహ్మద్‌పటేల్ ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం ఉదయం తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అహ్మద్ పటేల్ తన ఓటు హక్కును బరూచ్‌లోని అంక్లేశ్వర్‌లో వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుజరాత్‌లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు.

Congress victory in Gujarat: Ahmed Patel