Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

నేడు తేలనున్న రామగుండం భవితవ్యం

Congress who issued the whip to corporates

కార్పొరేటర్లకు విప్ జారీ చేసిన కాంగ్రెస్
విప్ ధిక్కరించి గట్టెక్కిస్తారని ఎంఎల్‌ఎ వర్గం ధీమా
సర్వ శక్తులు ఒడ్డుతున్న కొంకటి

మనతెలంగాణ/పెద్దపల్లి: రామగుండం కార్పొరేషన్ మేయర్ భవితవ్యం నేడు తేలనుండడంతోసర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వర కు వార్ వన్‌సైడ్ అనుకున్న ఎంఎల్‌ఎ వర్గం , తమ పార్టీ బీ ఫాంపై నెగ్గిన 20మంది కార్పొరేటర్లకు కాంగ్రెస్ విప్ జారి చే యడంతో కార్పొరేషన్ రాజకీయం రసవత్తరంగా మారింది. మేయర్,డిప్యూ టీ మేయర్‌ల అవిశ్వాస తీర్మానంపై నిర్వహించే సమావేశానికి ఎవరు హా జరు కావద్దని,అందరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, విప్‌ను ధిక్కరించితే అనర్హత వేటు తప్పదని హెచ్చరించడంతో కొంతమంది కాంగ్రెస్ కార్పొరేటర్లలో అంతర్మథనం మొదలైందని తెలుస్తోంది. ఎంఎల్‌ఏ వర్గానికి చెందిన 28మంది కార్పొరేటర్లు యాదగిరిగుట్ట క్యా ంపులో ఉండగా,మరో 8 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లను తిరుపతికి తరలించారు.10 మంది కార్పొరేటర్లలోమేయర్ లక్ష్మినారాయణ హైదరాబాద్‌లో క్యాంపు నిర్వహిస్తుండ గా,మిగతాకార్పొరేటర్లు క్యాంపులకు వెళ్లకుండా గోదావరిఖనిలోనే ఉన్నారు. 50మంది కార్పొరేటర్లు ఉన్న రామగుండం కార్పొరేషన్‌లో కోరం నిండాలన్నా,అవిశ్వాసం నెగ్గాలన్నా సమావేశానికి 35 మం ది సభ్యులు హాజరు కావాల్సిందే.సంఖ్యాబలం అంచనా వేసుకుంటే కోరం నిండడం ఖాయమని ఎంఎల్‌ఎ వర్గం ఇప్పటి వరకు భావించి నప్పటికి విప్ ప్రభావంతో చివరి నిమిషంలో ఎవరైనా జారి పోతే ఎలా అనే భయం కనిపిస్తోంది .నేడు జరుగనున్న సమావేశానికి క్యాంపుల నుంచి నేరుగా రానున్న నేపథ్యంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఎంఎల్‌ఎ వర్గం భావిస్తోం ది.బిజెపి ఇద్దరు సభ్యులతో పాటు తన వద్దనున్న 10మంది కార్పొరేటర్లకు తోడు కాంగ్రెస్ నుండి ఎంఎల్‌ఎ వర్గంలోకి వెల్లిన నలుగురు తరువాయి 3లో

Comments

comments