Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం

Congress will win 2019 General Election says chinnareddy

వనపర్తి ఎంఎల్‌ఎ డాక్టర్ జి.చిన్నారెడ్డి
మన తెలంగాణ/వనపర్తి రూరల్ : గ్రామ కమిటీల బలోపేతంతోనే కాంగ్రెస్ ప్రజలకు చేరువవుతుందని 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఎంఎల్‌ఎ డాక్టర్ జి.చిన్నారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వనపర్తి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో గ్రామ కాంగ్రెస్ కమిటి సభ్యులను నూత నంగా ఎంఎల్‌ఎ డాక్టర్ జి.చిన్నారెడ్డి సమక్షంలోల ఎన్నుకున్నారు. జమ్మల మడుగు తండా, నాచహల్లి, నాచహల్లి తాండా, బిక్యాతాండా, మర్రికుంట, జంగాల గుట్ట, లక్ష్మీనరసింహ్మకాలనీ, బీజర్‌గుట్ట,బీజర్‌గుట్ట తాండా శ్రీనివాస పూర్ తదితర గ్రామాల్లో ,తాండాల్లో నూతన కాంగ్రెస్ గ్రామ కమిటీలను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ డా.జి.చిన్నారెడ్డి మాట్లాడు తూ యువ నాయకులను, యూత్ కమిటీలను ఎక్కువగా కమిటీలను ఎన్ను కోవడం జరిగిందన్నారు. మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లకు ఎక్కువగా ప్రాధా న్యత ఇవ్వడం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో గ్రామ కమిమిటీలతో కాంగ్రె స్ అధికారం చేపడుతుందని ఎంఎల్‌ఎ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని పలు తండాల్లో, గ్రామాల్లో నూతన కమిటీలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. మర్రి కుంట కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు యాదగిరి, ప్రధానకార్యదర్శి శివకుమార్, కోశాధికారి కుమార్, మహిళా కమిటి సభ్యురాళ్లు అధ్యక్షురాలు అలివేల, ప్రధా న కార్యదర్శి అంజనమ్మ, కోశాధికారి సావిత్రమ్మ, కాంగ్రెస్ నాయకులు చీర్ల జనార్ధన్, రాములు, మన్నెం, ఆంజనేయులు, నాగేంద్రం, నాగస్వామిలు కమిటి ఎన్నికల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ధనలక్ష్మీ, తిరుప తయ్య, సహదేవ్, సురేష్‌గౌడ్, కిరణ్‌కుమార్, అబ్దుల్లా, బాబా, రాగివేణు, అంజి కాంగ్రెస్ గ్రామ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.

Comments

comments