Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం

 Congress will win in next election

మనతెలంగాణ/పరిగి : వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయమని పరిగి ఎమ్మెల్యే టి.రాంమ్మోహన్‌రెడ్డి జోస్యం చెప్పారు. పరిగి మండల పరిధిలోని ఖుదావంద్‌పూర్ గ్రామ సర్పంచ్ యాటకర్ల విజయ, ఆమె భర్త యాటకర్ల కృష్ణతోపాటు మరో 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేశారు. ఖుదావంద్‌పూర్ గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే టి.రాంమ్మోహన్‌రెడ్డికి గ్రామస్తులు బ్యాండు, మేళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి గ్రామ సర్పంచ్ యాటకర్ల విజయ, కృష్ణతోపాటు మరో వందమంది గ్రామస్తులను పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే టి.రాంమ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో గ్రామాల సర్పంచులు అసంతృప్తిగా ఉన్నారన్నారు. సర్పంచులు, ఇతర కాంట్రాక్టర్లు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రావడం లేదన్నారు. కేవలం కాగితాల్లో నిధులు విడుదల చేస్తున్నామని చెప్పడమే తప్ప చేసిన పనులకు బిల్లులు రావడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ కుటుంబపాలతో ప్రజలు విసిగి వేజారుతున్నామన్నారు. బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మబ్యపెడుతూ వారి పబ్బం గడుపుతున్నారంటూ తప్పుపట్టారు. రైతులకు ఒకే సారి పూర్తి స్థాయిలో లక్ష రూపాయలు మాఫీ చేస్తే రుణ విముక్తులయ్యేవారన్నారు. అలా కాకుండా కంటి తుడుపుచర్యగా ఎకరాలకు 4 వేలు ఇస్తురన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న సొంత కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులే అసంతృత్తిగా ఉన్నారన్న విషయం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలిచేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. ఊరారా పార్టీ జెండాలు ఎగుర వేసి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బి.నారాయణరెడ్డి, దండు అశోక్, నవాజ్‌రెడ్డి, పరుశరాంరెడ్డి, ముజుబూర్హ్రెమాన్, జమీల్, అశోక్, అయూబ్, నర్సింహులు, శంకరప్ప, ఆంజనేయులు, జగన్, సోయబ్, షాహీద్, ఖుదావంద్‌పూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments