Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

టిడిపి, వైసిపి కుట్ర

ప్రాజెక్టులను అడ్డుకుంటున్న ఆంధ్రా పార్టీలు, అందుకే అవి తెలంగాణలో ఖాళీ అయ్యాయి: సిఎం కెసిఆర్

cmహైదరాబాద్: తెలంగాణ రైతులకు సాగునీరు అందించేం దుకు ప్రాజెక్టులను నిర్మిస్తుంటే వాటిని అడ్డుకునేందుకు టిడిపి, వైసిపిలు ప్రయ త్నిస్తున్నాయని, దీక్షలు, ధర్నాలు, లేఖలతో పుల్లలు పెడుతున్నాయని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. అందుకే ఆ రెండు ఆంధ్రా పార్టీలు రాష్ట్రంలో ఖాళీ అయ్యాయయని, ప్రజలు ఆ పార్టీలను తిరస్కరిస్తున్నారని చెప్పారు. సిఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం మెదక్ జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్ ఎం.సఫాన్‌దేవ్, పటాన్‌చెర్‌వు టౌన్ టిడిపి అధ్య క్షుడు ఎం.విశ్వనాథం, నాయకులు ఎం.రవీందర్, మిరాజ్‌ఖాన్, భాస్కర్‌రెడ్డి, ఫరీద్దున్, జగన్, చంద్రశేఖర్, మల్లేశం తదితరులు ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారిని కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఎంతో కష్టపడి పక్క రాష్ట్రాలతో నిత్యం చర్చలు జరిపి ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమం చేశారని, దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని టిడిపి, వైసిపిలు కుట్రలు చేస్తున్నాయని మం డిపడ్డారు. ఆ రెండు పార్టీల నైజం ప్రజలకు తెలిసిందని, అందుకే రాష్ట్రం లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ పార్టీల డిపాజిట్లు రావడం లేదని ము ఖ్యమంత్రి తెలిపారు. కరెంటు చార్జీల పెంపు, నీటి పంపిణీలో వివక్షతను నిరసిస్తూనే తాను తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశా రు. ఎంతో కష్టపడి తెలంగాణ సాధించుకున్నామని, దానిని బాగు చేసుకో వల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. తెలంగాణలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులేవీ కొత్తవి కావని, సమైక్య రాష్ట్రంలో నాటి ప్రభుత్వాలు, సిఎం లు జీవోలు జారీ చేసినవేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  పునరు ద్ఘాటించారు.సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో నీరు పార కుండా ప్రా జెక్టులను డిజైన్ చేశారని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం రా ష్ట్రంలో ఎప్పటికీ నీటి ప్రవాహం ఉండేలా ప్రాజెక్టులను నిర్మిస్తుందని చె ప్పారు. రాజకీయాల్లో పనిచేసేవారు ఆశామాషిగాను, అల వాకగాను, తమాశాగాను ఉండవద్దని, ప్రజల అవసరాలను గుర్తించి,వాటిని పరిష్క రించే విధంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ కార్యక్ర మంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపిలు బి.పి.పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, చింతం ప్రభాకర్, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments