Search
Sunday 18 November 2018
  • :
  • :

కాంగ్రెస్‌ను అంతం చేసేందుకు కుట్ర : సోనియా

SONIA

ఢిల్లీ : స్వాతంత్య్ర పోరాటం నుంచి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యుపిఎ చైర్మన్ సోనియాగాంధీ తెలిపారు. దేశంలో కాంగ్రెస్‌ను అంతం చేసేందుకు కొన్ని దుష్టశక్తులు కుట్ర చేస్తున్నాయని ఆమె ధ్వజమెత్తారు. మన్మోహన్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం పదేళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఆమె చెప్పారు. ఢిల్లీలో జాతీయ కాంగ్రెస్ 84వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడారు. పదేళ్ల కాలంలో యుపిఎ ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలను ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం నీరుగార్చిందని ఆమె మండిపడ్డారు. రాజీవ్ హత్య అనంతరం తాను ప్రత్యేక పరిస్థితుల్లోనే రాజకీయాల్లోకి వచ్చానని ఆమె తెలిపారు. కాంగ్రెస్ అంటే కలిసి ఉండడమని, దేశ ప్రజలంతా కలిసి ఉండి కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకరావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. భారతీయ సంస్కృతిలో కాంగ్రెస్ పార్టీ ఒక భాగమని ఆమె స్పష్టం చేశారు. దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు పెన్నిది వంటిదని ఆమె చెప్పారు. కాంగ్రెస్ బలోపేతానికి బూత్ స్థాయి నుంచి చర్యలు తీసుకోవాలని ఆమె నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో అవినీతి రహిత భారత్‌ను నిర్మించుకుందామని సోనియా గాంధీ పిలుపునిచ్చారు. పక్షపాత ముక్త్‌ భారత్‌, అహంకార ముక్త్‌ భారత్‌ కోసం పోరాడుదామని ఆమె అన్నారు. ఈ ప్లీనరీలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, నేతలు మల్లికార్జున ఖర్గే, ఆజాద్‌లతో పాటు జాతీయ, ఆయా రాష్ట్రాల ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Conspiracy to End Congress : Sonia

Comments

comments