Home తాజా వార్తలు కానిస్టేబుల్ కట్నం వేధింపులు…

కానిస్టేబుల్ కట్నం వేధింపులు…

Police-haresment-his-wife

హైదరాబాద్ : అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని ఓ బాధితురాలు మాదాపూర్ పోలీసులను అశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అడిషనల్ సిఐ యాదయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న షేక్‌వల్లి భాషా, హసీన భాను భార్య భర్తలు. వీళ్లకు నలుగురు సంతానం. ప్రస్తుతం మాదాపూర్ పోలీస్ క్వార్టర్స్‌లో జీవనం గడుపుతున్నారు. అయితే షేక్‌వల్లి అదనపు కట్నం కోసం భార్యను తరుచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకే తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్టు హసీన భాను పోలీసుల ఫిర్యాదులో తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.