Home జాతీయ వార్తలు రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

ROAD-ACCIDENTతూర్పుగోదావరి : సామర్లకోట శివారులోని ముత్యాలమ్మ రాయి వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ చనిపోయాడు. సామర్లకోట పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రాంబాబు(42) కాకినాడలో నివాసం ఉంటున్నాడు. గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు బైక్‌పై వస్తుండగా, వెనుక నుంచి వచ్చిన గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొంది. ఈ ప్రమదంలో రాంబాబు అక్కడికక్కడే చనిపోయాడు. రాంబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.