Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

ఆటో బోల్తా : కానిస్టేబుల్ మృతి

RAGHVENDRA

అనంతపురం : ఆటో బోల్తా పడిన సంఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన విడపనకల్ మండలం పాల్తూరు వద్ద సోమవారం ఉదయం జరిగింది. పాల్తూరు పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రాఘవేంద్ర ఆదివారం రాత్రి తన డ్యూటీ ముగించుకుని సోమవారం ఉదయం ఉరువకొండకు ఆటోలో బయల్దేరాడు,. అతివేగం కారణంగా ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో రాఘవేంద్ర అక్కడికక్కడే చనిపోయారు. ఆటోలోని మిగతా 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 2013 బ్యాచ్‌కు చెందిన రాఘవేంద్రకు ఇంకా పెళ్లి కాలేదు. కానిస్టేబుల్ మృతిపై పోలీసు అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. ఇదే మార్గంలో వెళుతున్న మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. కానిస్టేబుల్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Constable Died With Auto Rollover at  Palturu in Anantapur

Comments

comments