Home తాజా వార్తలు నిజాయితీని చాటుకున్న కానిస్టేబుల్

నిజాయితీని చాటుకున్న కానిస్టేబుల్

Constable

 

మనతెలంగాణ/జన్నారం: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం గోదావరి నదిలో మహాశివరాత్రి సందర్బంగా పుణ్యస్నానాలు ఆచరించుటకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ తేలు సంతోష్ నిజాయితీని చాటుకొని పలువురి నుంచి అభినందనలు అందుకున్నాడు. ఇదే మండలం లింగయ్యపల్లి కి చెందిన సందవేని నర్సయ్య అనే వ్యక్తి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి హడావుడిలో తన పరుసును మరిచి ఇంటికి వెళ్లిపోయాడు.

బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ తేలు సంతోష్ కిక్కిరిసిన జనంలో కిందపడిపోయిన పరుసును గమనించి తీసుకొని చూడగా అందులో 10 వేల నగదు తోపాటు ఆదార్‌కార్డు లభించగా వెంటనే అతని అడ్రస్ తెలుసుకొని దొరికిన నగదులో పాటు పర్సును సందవేని నర్సయ్యకు అందజేసి నిజాయితీని చాటుకున్నాడు. విషయాన్ని తెలుసుకున్న భక్తులు కానిస్టేబుల్‌ను అభినందించారు. అదే విధంగా నీతి నిజాయితీతో విధులు నిర్వహించి స్నానానికి వచ్చిన ఓ వ్యక్తి పర్సు పోగొట్టుకొని ఇంటికి వెళ్లిన వ్యక్తికి కానిస్టేబుల్ సంతోష్ పిలిపించుకొని పర్సును అప్పగించడంతో లక్షెట్టిపేట సిఐ నగునూరి శ్రీనివాస్, ఎస్‌ఐ తహసినోద్దీన్‌లు కానిస్టేబుల్ ను అభినందించారు.

 

Constable Honest Duty in Mancherial