Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

కానిస్టేబుల్ సుశీల్‌కుమార్ అంత్యక్రియలు పూర్తి

SUSHIL

బెంగళూరు : తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోల కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టుబుల్ సుశీల్‌కుమార్ అమరుడయ్యారు. సుశీల్ అంత్యక్రియలు శనివారం కర్నాటకలోని బీదర్‌లో జరిగాయి. 20 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు వచ్చి ఇక్కడే ఆయన కుటుంబం స్థిర నివాసం ఏర్పరచుకుంది. జహీరాబాద్, సదాశివపేటలో ఆయన విద్యాభ్యాసం చేశారు. అనంతరం సుశీల్‌కుమార్ పోలీసు కానిస్టేబుల్‌గా ఎంపికై పలు పోలీసు స్టేషన్లలో పని చేశారు. 2014లో ఆయన గ్రేహౌండ్స్‌కి పదోన్నతిపై వెళ్లారు. సుశీల్‌కుమార్ అంత్యక్రియలకు తెలంగాణ డిజిపి మహేందర్‌రెడ్డి, ఇంటలిజెన్స్ ఐజి నవీన్‌చంద్, సంగారెడ్డి ఎస్‌పి చంద్రశేఖర్‌రెడ్డి, బీదర్ ఎస్‌పి దేవరాజ్ తదితరులతో పాటు పలువురు పోలీసు అధికారులు హాజరయ్యారు.

Constable Sushil Kumar  Funeral Completed

Comments

comments