Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు

Harayana-Police-selections800 మీటర్లలో అర్హత సాధించిన వారికే మిగతా ఈ వెంట్స్‌లలో అవకాశం
నల్లగొండ టౌన్ : కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను స్థానిక మేఖల అభినవ్ స్టేడియంలో శుక్రవారం జిల్లా ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి పరిశీలనలో నిర్వహించారు. ఈ ఈవెంట్స్‌లలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. మొదట 800 మీటర్స్‌లలో అర్హత సాధించిన వారికే మిగితా ఈవెంట్స్‌లలో పాల్గొనే అవకాశం కల్పించడం జరిగింది. శుక్రవారం కేవలం 800 మీటర్లు, అభ్యర్థుల ఎత్తు, చాతీ పొడవులను తీసుకున్నారు. నేటి నుంచి ఇందులో అర్హత సాధించిన వారికి మిగిత ఈవెంట్స్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 9న రిజక్షస్ మెమో అందుకున్న ఎస్‌ఐ అభ్యర్థులకు అన్ని ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. ఆగస్టు 8 వరకు కొనసాగనున్నాయి. రోజుకు 1200 మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా 800 మందికి ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్స్‌లలో ఎఎస్పీ గంగారామ్, ఇద్దరు డిఎస్పీలు, నలుగురు సిఐలు, 12 ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments