Search
Wednesday 26 September 2018
  • :
  • :

ముగిసిన కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు

consatable-examsఖమ్మం క్రైం: నగరంలోని పోలీసు పెరేడ్ మైదానంలో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహ దారుఢ్య పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. గత నెల 15న ప్రా రంభమైన ఎంపిక ప్రకియలో ఎటువంటి అవకతవ కలు జరగకుండా 21 రోజుల పాటు ఎస్‌పి షన్వాజ్ ఖాసీం పర్యవేక్షణలో తుది రాత పరీక్షకు సుమారుగా 10,936 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పురుష అభ్యర్థులు 8513, మహిళలు 2423 ఎంపికయ్యారు.ఈ సంద ర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ నెలరోజుల పాటు ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో పోలీసు సిబ్బంది, వ్యా యామ ఉపాధ్యాయులు, వైద్యులు, మినిస్ట్రీయల్ స్టాప్ నిబద్దతో పని చేశారని అన్నారు. ప్రధానంగా అభ్యర్థులు బయో మెట్రిక్, ఆధార్ కార్డు, సర్టిఫికెట పరిశీలనలో తప్పులు లేకుండా అదనపు ఎస్‌పి సాయికృష్ణ ఆధ్వ ర్యంలో అప్రమత్తంగా వ్యవహరించారని అన్నారు. ఛాతి, ఎత్తు కొలతలు తదితర అంశాల్లో డిఎంహెచ్‌ఓ ఎ.కొండల్ రావు, తూనికలు, కొలతల శాఖ ఇన్స్‌పెక్టర్ విజయ్ కుమార్ సహకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్‌పి సాయికృష్ణ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్‌పి అశోక్‌కుమార్, డిఎస్‌పిలు కొల్లు సురేష్ కుమార్, రామి రెడ్డి, సురేందర్‌రావు, వీరేశ్వరరావు, ఎఆర్ డిఎస్‌పిలు సంజీవ్, మాణిక్‌రాజ్, ఎఓ సత్యకుమార్, ఎస్.జానకి రామ్, జయరాజ్, సమ్మయ్య, సత్యవతి, చంద్రకళ, అక్తర్ ఉన్నీసా బేగం, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments