Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ముగిసిన కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు

Constable-examమెయిన్స్‌కు ఎంపికైన 4,829 మంది పురుషులు * 1,134 మంది మహిళా అభ్యర్థులు
వరంగల్ స్పోర్ట్ : పోలీసు కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు శుక్రవారం ముగి శాయి. కాకతీయ యూనివర్సిటీలో రూరల్ అభ్యర్థుల పరీక్షలకు 12,000 మంది అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు సజావుగా ముగిశాయని ఎస్పీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పురుష విభాగంలో 4,829 మంది అభ్యర్థులు, మహిళా విభాగంలో 1,134 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించి రాత పరీక్షకు ఎంపికయ్యారని, త్వరలో జరుగబోయే కానిస్టేబుళ్ల మెయిన్స్ రాత పరీక్షకు హాజరు కాను న్నారని తెలిపారు. కెయు మైదానంలో ఎస్పీ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో ఎ లాంటి అవ కతవకలు జరగకుండా, అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా పరీక్షలకు నిర్వహించామని, ఈవెంట్లను వీడియో కెమెరాలో చిత్రీకరిం చడం జరిగిందని చివరి రోజున 390 మంది అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు జరిగాయన్నారు. అనంతరం చివరి రోజున పరీక్షలు విజ యవంతం కావడంతో పరీక్షల్లో భాగస్వామ్యులైన వ్యాయామ ఉపాధ్యా యులను, డాక్టర్లను పోలీస్ అధికారులను, డిపిఓ ఐటి కోర్ సభ్యులను, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అంబర్ కిషోర్ ఝా అభినందించి బహుమతు లను అందజేశారు. ఈకార్యక్రమంలో వరంగల్ రూరల్ అదనపు ఎస్పీ జాన్ వెస్లీ డిఎస్‌పిలు సత్యనారాయ ణరెడ్డి సుధీంద్ర, మురళీధర్, రాజ మహేంద్రనాయక్, రాంచందర్‌రావు, కుమారస్వామి, పోలీసులు అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, డాక్టర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

comments