Home జాతీయ వార్తలు నోట్ల రద్దు కేసు రాజ్యాంగ పీఠానికి

నోట్ల రద్దు కేసు రాజ్యాంగ పీఠానికి

విచారించనున్న ఐదుగురు సభ్యుల ధర్మాసనం
హైకోర్టుల్లో దాఖలైన వ్యాజ్యాలన్నీ అప్పగింత
9 కీలక అంశాలపై జరగనున్న విచారణ

supreme-courtన్యూఢిల్లీ : పెద్దనోట్ల రద్దుకు ఉన్న రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలై న పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.ఠాకూర్ ఈ కేసును ఐదు గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. పెద్దనోట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తం గా పలు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లపై స్టే విధించారు. ఈ కేసుల అన్నింటినీ ఒకే చోట కలిపి ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని స్పష్టం చేశారు. పాతనోట్ల చెల్లుబాటుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని కూడా జస్టిస్ ఠాకూర్ తోసిపుచ్చారు. ఆర్థిక, ద్రవ్య విధానాల్లో ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని స్పష్టం చేశారు. అయితే సదరు నిర్ణయాలు ప్రజల హక్కులపై ప్రభావితం చేయకుండా ఉండాలని అన్నారు. పెద్దనోట్ల రద్దుపై లేవనెత్తిన 9 సందేహాలను రాజ్యాంగ ధర్మాసమే విచారిస్తుం దని చెప్పారు. అయితే వారానికి 24 వేలు ఇస్తామని కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు.
దేశ వ్యా ప్తంగా కొత్త కరెన్సీ కట్టలకు కట్టలు పట్టుబడుతున్నా సామా న్యుడికి మాత్రం వారానికి 24 వేలు లభించడం లేదని వాయి పోయారు. విత్ డ్రా పరిమితిపై సమయానుకూలంగా ఎప్పటిక ప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. దీనిపై స్పందించిన అటార్నిజనరల్ కొంత మంది బ్యాంకు ఉద్యోగుల కారణందా ఈ దుస్థితి ఏర్పడిందని వాపోయారు. పాతనోట్లలో మొత్తం 40 మొత్తాన్ని కొత్తనోట్ల రూపంలో ప్రజలకు అందించినట్లు వెల్లడించారు. సుప్రీంతీర్పుతో కేంద్రానికి కొంత ఊరట లభించినప్పటికీ తొమ్మిది ప్రశ్నలతో చీఫ్ జస్టిస్ రూపొందించిన ప్రశ్నావళి కలవరపెడుతోంది.
రాజ్యాంగ ధర్మాసనం విచారించనున్న అంశాలు
* నవంబర్ 8 ప్రకటన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934 చట్టంలోని సెక్షన్ 26ను ఉల్లంఘిస్తుందా ?
* నవంబర్ 8 ప్రకటన ఆతర్వాత జారీ చేసిన నోటఫికషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 300( ఎ )కు లోబడి ఉన్నాయా ?
* పెద్దనోట్ల రద్దు , కొత్తనోట్ల జారీలో రూపొందించిన నిబం ధనలు సమానత్వం, జీవించేహక్కును కాలరాసాయా ?
* అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాతే పెద్దనోట్ల రద్దును ప్రకటిం చారా? కొత్త నోట్లు ఆపాటికే ఏ మేరకు ముద్రించారు ?
* ప్రభుత్వ ద్రవ్య, ఆర్థిక వ్యవహారాల్లో న్యాయస్థానాలు ఏమేరకు జోక్యం చేసుకోవచ్చు ?
* ఆర్టికల్ 32 కింద పెద్దనోట్ల రద్దుపై పలు రాజకీయ పార్టీలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేసే అధికారం ఉందా ?
* విత్‌డ్రాపై పరిమితులు హక్కుల ఉల్లంఘన కాదా
* పాతనోట్ల స్వీకరణ, కొత్తనోట్ల జారీలో కోపరేవిట్ బ్యాంకులను దూరంగా ఉంచడం ఏ మేరకు సబబు ?