Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

నాలాపై సులబ్ కాంప్లెక్స్ నిర్మాణం…స్థానికుల ఆందోళన

 Construction of Sulab Complex on Nala

మనతెలంగాణ/సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జి ల్లా కేంద్రంలోని ప్రధాన నాలా (మురికి కాలు వ)పై సులబ్ కాంప్లెక్స్ నిర్మాణం వివాదాస్పదమవుతోంది. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ ప రిధిలోని 12,13వ వార్డు సరిహద్దుగా ప్రధాన మురికి కాలువ పారుతోంది.దీనిపై మున్సిప ల్ కూరగాయల మార్కెట్‌కు ఒకవైపు, నేతాజి సుభాస్ చంద్రబోస్ విగ్రహనికి మరోవైపు కేవ లం 50మీటర్ల దూరంలోనే మరో సులభ్ ంప్లెక్స్ నిర్మాణం చేపట్టడాన్ని మాజి మున్సిపల్ కౌన్సిలర్ మ్యాన శంకర్ సహ వార్డ్‌లోని ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కూరగాయల మార్కెట్‌లో సులబ్‌కాంప్లెక్స్ ఉండగా మరో సులభ్ కాంప్లెక్స్‌న్ జనావాసాల మధ్య న అదీ సెప్టిక్ ట్యాంక్ లేకుండా, భవన నిర్మాణానికి కూడా పిల్లర్లు లేకుండా కేవలం నాలా పై స్లాబ్‌పోసి సులబ్‌కాంప్లెక్స్ నిర్మించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తూ ఈనెల 21న మున్సిపల్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
అయితే ఈ విషయలో తేది 15-07-2018 న జవాబిస్తామని మున్సిపల్ పౌరసేవా కేంద్ర సహయకులు లిఖిత పూర్వకంగా సమాచా రం ఇచ్చికూడా సులబ్‌కాంప్లెక్స్ పనులను ప్రారంభించడాన్ని అది కూడా రాత్రి వేళ ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఆఘమేఘాల మీద పూర్తి చే యాలని చూడటం వెనుక ఎవరి ప్రయోజనా లు దాగున్నాయని వార్డు ప్రజలు నిలదీస్తున్నా రు. సిరిసిల్లలో ఓపెన్ లాట్రిన్స్‌ను తొలగించి, ప్రతి ఇంటిలో సెప్టిక్ ట్యాంక్‌ను నిర్మింపచేసి, జాతీయ స్థాయిలో సిరిసిల్ల నుంచి ప్రాతిని ధ్యం వహిస్తున్న మంత్రి కె.తారక రామారావు బహుమతులు అందుకోగా ఆయన స్ఫూర్తికి విరుద్దంగా సెప్టిక్‌ట్యాంక్ లేకుండా నాలపైనే సులబ్‌కాంప్లెక్స్ అదీ జనావాసాల మధ్య ని ర్మించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మా ర్కెట్‌లో ఉన్న సులబ్‌కాంప్లెక్స్‌ను అవసరమైతే విస్తరించుకునే అవకాశం ఉన్నా కక్ష సాధింపుతోనే అవసరం లేకపోయినా సుభాస్‌నగర్‌లోని ప్రధాన నాలాపై సులబ్‌కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తామందరం మంత్రి కే తారక రామారావును కలుస్తామని వారు అన్నారు.అధికారులు, ప్రజాప్రతినిధులు మం త్రికి చెడ్డపేరు తీసుక రావడానికే అవసరంలేకపోయినా, సెప్టిక్‌ట్యాంక్ లేకుండా నాలాపై సులబ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని ఆరోపించా రు. గతంలో కూడా తహసిల్ రోడ్‌లో కూ డా ఇలాగే నాలాపై సులబ్ కాంప్లెక్స్ నిర్మించారని వారు వివరించారు. అధికారులు, ప్ర జాప్రతినిధులు ఇప్పటికైనా ప్రజల అభ్యంతరా లు గమనించి సుభాస్‌నగర్‌లోని సులబ్ కాం ప్లెక్స్ నిర్మాణాన్ని నిలిపివేయాలని వారు డి మాండ్ చేస్తున్నారు.

Comments

comments