Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

మరుగుదొడ్ల నిర్మాణంలో మనమే ముందు

 అందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి
 సిద్దిపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శం కావాలి
అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి
భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

mdk1సిద్దిపేట అర్బన్ / చిన్నకోడూరు : మరుగుదొడ్ల నిర్మా ణంలో మనమే ముందుండాలని, అందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం ఆయన చిన్నకోడూరు మండలం మండపల్లి, ఇబ్రహీంనగర్, మేడిపల్లి, చౌడారం గ్రామాల్లో, సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో మరుగుదొడ్లు నిర్మిస్తున్న తీరు ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గం మరుగుదొడ్ల నిర్మాణంలో రాష్ట్రంలో ఆదర్శంగా నిలువాలని పేర్కొన్నారు. తమ స్వంత నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అక్టోబర్ 2 నాటికి నియోజకవర్గంలో మరుగుదొడ్లు లేని ఇళ్లు ఉండకూడదని అన్నారు. అందుకు గాను అధికారులు బాధ్యతయుతంగా పనులు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికి నియోజ కవర్గం లో 71 గ్రామాలకుగాను 41 గ్రామాలు నిర్మల్ పురష్కార్ అవార్డులు అందుకున్నాయన్నారు. వందశాతం మరుగుదొ డ్లు నిర్మించేందుకు ప్రజలను మరింత చైతన్యపరిచేందకు ఇంటింటికి తిరిగి ప్రత్యేకంగా మరుగుదొడ్డి నిర్మాణం గురించి చర్చించడం జరిగింది. యుద్ధప్రాతిపాదికన నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో పనులు ముమ్మరం గా కొనసా గుతున్నాయన్నారు.

అందుకు గాను ప్రజా ప్రతి నిధులు, అధికారులు ప్రత్యేక చొరవచూపడం అభినందనీ యమన్నారు. సిద్దిపేట మండలంలో 16683, చిన్నకోడూ రు మండలంలో 13113, నంగునూరులో 14137 ఇండ్లున్నాయన్నారు. మొత్తం 43933 ఇండ్లకు గాను 42818 మరుగుదొడ్లు పూర్తి కాగా మిగతావి 1115 అక్టోబర్ 2 నాటికి పూర్తి అవుతాయని, దీంతో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించినట్టు అవుతుందన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 20800 లకు 19799 పూర్తి కాగా మిగతా 1001 మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు ఒక ఉద్యమంగా పనులు చేస్తున్నారని అన్నారు. మొత్తం 64733 మరుగుదొడ్లకు 62617 పూర్తికాగా నియో జకవర్గంలో 2116 నిర్మాణ దశలో ఉన్నాయని నెలాఖ రులో పూర్తి అవుతాయని పేర్కొన్నారు. చిన్నకోడూరు మండలంలోని రామునిపట్ల, ఇబ్రహీంనగర్‌లలో చెక్‌డ్యాం ల ఎత్తుపెంచాలని ఎస్‌ఈ ఆనంద్‌కు ఆదేశించారు. ఎత్తు పెంచడం వల్ల రైతులు రెండు దపాలుగా పంటలు వేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సిద్దిపేట నియోజకవర్గం లో రూ.8 కోట్లతో 9 చెక్‌డ్యాంలు నిర్మించనున్నట్టు తెలిపారు. పాలమాకుల, మిట్టపల్లి, మల్లారం, రాఘవాపూర్, మైలా రంలో మూడు, సిద్దిపేట శివారులో రెండు చొప్పున చెక్ డ్యాంలు నిర్మించేం దుకు ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు.
సిద్దిపేట నియోజకవర్గంలో 8 కోట్లతో రెండు మండలాల్లో చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్, నంగునూరు మం డలం ఖాతా, నంగునూరులో, ఆరు నెలల్లో పెద్దవాగులోకి దేవాదుల ప్రాజెక్టునీ ళ్ళు తెప్పించి, అక్కడినుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వార ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తానన్నారు. సిద్దిపే టలోని కొమటిచెరువును సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు.

వచ్చే బతుకమ్మ పం డుగ వరకు సిద్దిపేట చుట్టుప్రక్కల ఉన్న నాలుగు చెరువులను మినీ ట్యాంక్ బండ్‌లుగా తీర్చి దిద్దాల ని, అందుకుగాను చింతల చెరువుకు రూ.5.40 కోట్లు నిధులు మంజూరు అయినట్టు, ఎర్రచెరువుకు రూ.5.80 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. నర్సాపూర్ చెరువును సందర్శించి అధికారు లకు పనులు చేయాలని ఆదేశించారు. సిద్దిపేటలో మినీ ట్యాం కు బండ్ కళ ఎన్నో ఎళ్ళ కల అని, రూ.7.50 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. 30 సీట్లతో ఒక బోటు, రెండు వాటర్‌లో పౌంటేన్‌లు ఏర్పా టు చేస్తామన్నారు. కట్టకింద భాగంలో ఉన్న ఖాలీ స్థలంలో సుందరమైన పార్కును నిర్మించడం తమ కల అని , అందుకు ఆర్డీఓ ప్రత్యేక చొరవ చూపి భూమి యజమానులతో చర్చించాలని తెలిపారు. సిద్దిపేటలోని శ్రీరామకుంట్ల, ప్రశాంత్‌నగర్‌లలో వైకుంఠ ద్వామంలు నిర్మిచండం జరగుతుందని, త్వరలో మరో రెండు వైకుంఠ రథాలు తెస్తామన్నారు. అనంతరం జిల్లాలోని నారాయణఖేడ్ నియో జకవర్గంలోని మానూరు మండలంకు చెందిన 9 మంది టిడిపి నాయకులు మంత్రి ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఒఎస్‌డీ బాల్‌రాజు, ఇరిగేషన్ ఎస్‌ఈ ఆనంద్, విద్యుత్, పంచాయతీరాజ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, చిన్నకోడూరు ఎంపిపి కూర మాణిక్యరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, చిన్నా తదితరులు పల్గొన్నారు.

Comments

comments