Search
Saturday 21 July 2018
  • :
  • :
Latest News

24వ రోజుకు చేరిన కాంట్రాక్టు కార్మికుల సమ్మె

Contact Workers Doing Strike In Yadadri District

యాదాద్రి ః కార్మికులకు న్యాయబధ్ధమైన వేతనాలను చెల్లించాలని మండల పరిధిలోని ప్రీమియర్ ఎక్స్‌ఫ్లోజివ్ కాంట్రాక్టు కార్మికుల చేపట్టిన నిరవదిక సమ్మె 24వ రోజు కొనసాగింది. శుక్రవారం రోజున కార్మికులు సాగించిన సమ్మెలో వంట వార్పుతో నిరసన తెలిపారు. ఈ సమ్మెకు మద్దతు తెలుపుతు పాల్గొన సిఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యాక్షులు సుధభాస్కర్ మాట్లాడుతు పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం అమలు పరచాలని సుమారు 500 మంది కార్మికులు ఆందోళనకు దిగి సమ్మె చేపట్టి 24 రోజులు గడుస్తున్న కంపెనీ యాజమాన్యం స్పందించకపోవడం దారుణమన్నారు. కార్మికుల హక్కుల ప్రకారం న్యాయమైన డిమాండ్‌లను యాజమాన్యం అమలు పరచాలని డిమాండ్ చేశారు. వెట్టి చాకిరిని చేయించుకుంటు శ్రమ దోపిడి చేస్తున్న యాజమాన్యం తక్షణమే స్పందించకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎండి జహంగీర్, కోమటి రెడ్డి చంద్రారెడ్డి, బబ్బూరి పోశెట్టి, సత్యనారాయణ, భీమాగాని రాములు, సర్పంచ్ భీమగాని మాధవి, చెక్క రమేష్, కిషన్, రాజశేఖర్, నర్సింహులు, కనకయ్య, లత, మధు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీయస్ మద్దతు
కార్మికుల సమ్మెకు ఎమ్మార్పీయస్ నాయకులు మద్దతు తెలిపారు. సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఎమ్మార్పీయస్ నాయకులు మాట్లాడుతు కార్మికుల పట్ల యాజమాన్యం మొండివైఖరిని వీడి వారి డిమాండ్‌లను అమలు పరచాలని నిత్యవసర వస్తువుల ధరల విపరీతంగా పెరిగి కార్మికులు జీవనం గడుపుకోవడం కష్టంగా ఉందని కంపెనీ యాజమాన్యం దానిని గుర్తించి కార్మికులకు న్యాయం చేయాలని పూర్తి మద్దతు తెలిపారు.

Comments

comments