Search
Wednesday 14 November 2018
  • :
  • :

కాంట్రాక్టు లెక్చరర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారు: కడియం శ్రీహరి

Kadiyam-Srihari1

హైదరాబాద్: శాసన మండ లిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వి.భూపా ల్‌రెడ్డి వేసిన ప్రశ్న సభలో గందరగోళానికి దారితీసింది.  “ప్రైవేట్  జూనియర్, డిగ్రీ కళాశాలలోని కాంట్రాక్టు లెక్చరర్ల” గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి సభ్యుని ప్రశ్న పట్ల ఆశ్చ ర్యం వ్యక్తం చేశారు.  “ప్రైవేట్  జూనియర్, డిగ్రీ కళాశాలలోని కాంట్రాక్టు లెక్చరర్ల పదవులను బడ్జెట్ మంజూరైన పదవులు గా మార్చే ప్రతిపాదన ఉందా”,  వారికి 10వ వేతన సవరణ కమీషన్‌ను అమలు చేసే ప్రతిపాదన ఉందా? అయితే ఆ వివరాలను ఏమిటి?” అని వి.భూపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందుకు విద్యాశాఖ మంత్రి శాఖ మంత్రి కడియం శ్రీహరి స్పందిస్తూ  ప్రైవేట్  జూనియర్, డిగ్రీ కళాశాలలోని కాంట్రాక్టు లెక్చరర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, వారికి  ప్రభుత్వంతో సంబంధంలేదని స్పష్టం చేశారు.  సభ్యుడు అడిగిన ప్రశ్న గందరగోళంగా ఉందని ఆయన పేర్కొ న్నారు. ఒకవేళ సభ్యుడు పొరపాటుగా ప్రశ్న అడిగినా ప్రైవేట్ ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి రారని అధికారులు సంబంధిత  సభ్యుడికి  తెలియజేయాల్సి ందన్నారు.

Comments

comments