Search
Sunday 23 September 2018
  • :
  • :

కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్దీకరించండి

బిజెపి జనగామ జిల్లా అధ్యక్షుడు కెవిఎల్‌ఎన్‌రెడ్డి

Contract-Lecturer

జనగామరూరల్: కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలని జనగామ జిల్లా బిజేపి అధ్యక్షుడు కెవిఎల్‌ఎన్‌రెడ్డి సమ్మెను ప్రారంబించి వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ లెక్చరర్లు చేస్తున్న నిరవదిక దీక్షా శిభిరంలో దీక్షల్లో కూర్చున్న వారు కె. భాస్కర్, జి. గణేశ్, జె. సంద్యారాణీ, తిరుపతి, కల్పన, సభిహబేగం, మీన, రజిత, సంతోష్, స్వప్న, రఫీతా, జహన్, సబిహబేగంలు కూర్చున్నారు. గురువారం దీక్షాశిభిరాన్ని సందర్శించి ఆయన మాట్లాడుతూ 15 రోజులుగా కాంట్రాక్ట్ లెక్చరర్లు దీక్ష చేస్తూన్న ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు.

అంతేగాక కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి 50 శాతం పెంచామని చెప్తు సమ్మె విరమించకుంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం ప్రభుత్వం నిర్లక్ష వైఖరికి నిదర్శమని ఎద్దెవా చేశారు. కడియం లెక్చరర్ల సమస్యలపట్ల దురుసుగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి విరుద్దమన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను దోపిడికి గురిచేస్తుందన్నారు, అద్యాపక వృత్తి నుండి వచ్చిన కడియం అద్యాపకుల బ్రతుకులను రోడ్డుపాలు చేయడం సమంజసం కాదన్నారు. జిల్లా కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షులు కొలిపాక భాస్కర్ మాట్లాడుతూ నేడు హన్మకొండలోని ఏకశిల పార్కు వద్ద కోనసాగుతున్న ఆమరణ నిరహర దీక్షకు మద్దతుగా జనగామ జిల్లా కాంట్రాక్ట్ లెక్చరర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లెక్చరర్ల డిమాండ్‌ల్లను పరిష్కకరించి రెగ్యులైజర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈసంఘీభావం తెలిపిన వారిలో బిజేపి జనగామ పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments