Search
Saturday 17 November 2018
  • :
  • :

సమ్మెబాటలో కాంట్రాక్టు లెక్చరర్లు

హామీలు నెరవేర్చని ప్రభుత్వం
నష్టపోనున్న విద్యార్థులు

Teachersపెద్దపల్లి: సమస్యల పరిష్కారం కోసం కాంట్రాక్టు లెక్చరర్లు సమ్మె బాట పట్టారు. ఎన్నికల ముందు కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తామని ప్రభు త్వం హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకు తమకు ఇచ్చిన మాటను నెరవేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రా క్టు లెక్చరర్ల సమ్మెతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు రానున్నది పరీక్షల కాలం కావడంతో నష్టపోయే పరిస్థితి ఏర్పడనుంది. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, మార్చిలో వార్షిక పరీక్షలు జరగనున్న దృష్టా విద్యార్థులకు ఈ నిర్ణయం ఇబ్బందికరంగా మారింది.

పెద్దపల్లి జిల్లాలో దాదాపు వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా, ఆయా కళాశాలల్లో 100కు పైగా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు రూ. 4వేల నెలసరి వేతనంతో ప్రారంభమైందని, 2011లో 9వ పీఆర్‌సీ ప్రకారం రూ. 18వేలకు చేరింది. ప్రస్తు తం రూ. 27వేలకు దీనిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నా ఇది తమకు నష్టమేనని వారు వాపోతున్నారు.

ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేయడంతోపాటు కళాశాలల బడ్జెట్ మంజూరు పోస్టులు, ఒకేషనల్ సెకండ్ పోస్టులు ప్రకటించాలని, 10వ పీ ఆర్సీ ప్రకారం జూనియర్ కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టుకు బేసిక్ పే రూ. 37,100, డీఏ చెల్లించాలని, ఏడాదికి 22 సీఎల్‌లు, 5 ఓహెచ్‌లు ఇవ్వాలని, మహిళా లెక్చరర్లకు వే తనంతో కూడిన ప్రసూతిసెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే కాంట్రాక్ట్ లెక్చ రర్ల సమస్యలపై సిఎం, ఉప ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించి పరిష్కరించేం దుకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆందోళన బాటపట్టి రోడ్డెక్కేలా చేయడం ప్రభుత్వానికి సరికాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ప్రభుత్వం తమను గుర్తించాలి
కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం గుర్తించాలి. 15 ఏళ్లకు పైగా జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు బోధన అందిస్తున్నాం. చాలీ చాలని వేతనాలతో ఇబ్బం దులు పడుతున్నాం.
గత ప్రభుత్వాల హయాంలో న్యాయం జరగలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై మన పాలకుల హయాం లో నూ న్యాయం జరగక పోవడం సరికాదు. ఇప్పటికైనా మా సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి.
సంగని విక్రమాదిత్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు.

సమస్యలు పరిష్కరించేదాకా పోరాటం
ప్రభుత్వం ఎన్నికల ముందు కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మి నెంట్ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరిస్తుందని ఇన్నిరోజులుగా వేచి చూస్తు న్నాం. హామీలను విస్మరించడంతో సమ్మెబాట పట్టాం. సమస్యలు పరిష్కరించేదాకా సమ్మె పోరాటం కొన సాగుతుంది.
సునిల్, జిల్లా అధ్యక్షుడు.

Comments

comments