Search
Sunday 18 November 2018
  • :
  • :

నాణ్యత లోపంతో పనులు

కాంట్రాక్టుర్ల ఇష్టారాజ్యం
అధికారుల పర్యవేక్షణ కరువు

Corruption-in-Peddapally

పెద్దపల్లిటౌన్: పెద్దపల్లి నగర పంచాయతీ పరిధి లోని పలు కాలనీలలో జరుగుతున్న డ్రెయినేజీ, సిసి రోడ్ల పనుల్లో నా ణ్యత లోపించింది, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిర్మా ణాలు చేపట్టడంతో పనులు లోపభూయిష్టంగాతయారయ్యాయి. ప ట్టణంలో జరుగుతున్న పనులపై అధికారుల పర్యవేక్షణ కరువు కావ డంతో కాం ట్రాక్టర్లు తమ ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేపట్టుతు న్నారని పలువురు అరోపిస్తున్నారు.

ఉదయ్‌నగర్ నుంచి అమర్ చంద్ మార్గ్ చర్చి వరకు నూర్తి చేసిన డ్రెనేజీ పనుల్లో నాణ్యత లేక పోవడ ంతో నిర్మాణాలు మూన్నాళ్ల ముచ్చటగానే మారి పోతున్నాయి. గత ంలో సుభాష్‌నగర్‌లో నిర్మించిన మురికి కాలువ నిర్మాణంలోను సి మెంట్ సరిగా వాడక పోవడంతో నిర్మించిన 24 గంటల్లోనే కూలి పోగ గమనించిన కాంట్రాక్టర్ వెంటనే మరోసారి మరమ్మతులు చేసి చేతు లు దులుపుకున్నాడు. కాంట్రాక్టర్ నుంచి మమూళ్లు అందుతుండడం తో అధికారులు నిమ్మకు నీరెల్లినట్లుగా వ్యవహరిస్తూ నిర్మాణాల పట్ల చూసీ చూడనట్లుగా వ్వవహరిస్తు రికార్డులను నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. అభివృద్ది డ్రైనేజీల నిర్మాణ పనుల్లో అధికారులు హద్దులు నిర్ణయించినప్పటికి వాటిని ఉల్లంఘిస్తూ ఇంటి యజమానులు, కౌ న్సిలర్ల జోక్యంతో హద్దులు తగ్గించి నిర్మాణాలు చేపట్టడంతో రోడ్డు ఇరుకుగా మారే పరిస్థి తి ఏర్పడుతోంది. కా ంట్రాక్టర్లు చేస్తున్న పనులపై పర్య వేక్షణ లేకపోవడంతో నిర్మాణాలలో నాణ్య త పాటించడం లేదని, అధికారులు స్పందించి నిర్మా ణాల సమయంలో పనులను పరిశీలించి నాణ్యతతో జరిగే లా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఇష్టారాజ్యంగా ్రడ్రైనేజీ పనులు

కాంట్రాక్టర్లు మా వాడలో ఇష్టా రాజ్యంగా డ్రైనేజి పనులు చేపట్టి నా రు. డ్రైనేజీ పైన రోడు వేసి తక్కువ సిమెంట్ వాడకం వలన నిర్మాణం చేపట్టిన వారం రోజులకు సిమెంట్ ఎగిరి పోయింది వాడ ప్రజలం లోల్లి చేస్తే కాంట్రాక్టర్ వచ్చిండు సరి చేసిండు మరో డ్రైనేజి ని ర్మాణం చేసి నెలలు గడిచినప్పటికి డ్రైనేజి నీళ్ళు పోయె ందుకు నిర్మాణం చేపట్టలేదు. అధికారులు కుడా చూ సిన దఖాలాలు లేవు.
కుక్క నంబయ్య ఉదయ్‌నగర్, పెద్దపల్లి .

Comments

comments