Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పాఠశాలకు తాళాలు వేసిన కాంట్రాక్టర్

School_manatelangana copyమన తెలంగాణ / హత్నూర : ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు అంద లేదని ఆగ్రహించిన కాంట్రాక్టర్ తాను నిర్మించి ఇచ్చిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదులకు తాళాలు వేశాడు. దాంతో ఉన్న పళం గా పాఠశాల మూతపడిన స్థితి తలెత్తింది. ఉపా ధ్యాయులు విద్యార్థులు భయాందోళనకు గుర య్యారు. మెదక్ జిల్లా హత్నూర మండల పరిధిలోని తుర్కల ఖానాపూర్‌లో మంగళవారం నాడు ఈ ఉదంతం జరిగింది. అడవిరెడ్డి అనే కాంట్రాక్టర్ 8లక్షల 50 వేల రూపాయల బిల్లు బకాయిని ప్రభుత్వం రెండేళ్లు గడుస్తున్నా చెల్లించక పోవడంపై అసంతృప్తికి లోనై మంగళవారం నాడు ఉన్నత పాఠశాల గదులకు తాళం వేసి ఉపాధ్యాయులను విద్యార్థులను బయటికి తరిమే శాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ ప్రమోద్ కుమార్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో మానసిక స్థైర్యాన్ని నింపి జరిగిన ఉదంతాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. అనంతరం తాళాలను పగులగొట్టి పాఠశాల మామూలుగా నడిచేటట్టు చూశాడు.

School_manatelangana1

Comments

comments