Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరించాలి: కొప్పిశెట్టి సురేష్

Contractual lecturers should be regulated

సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, డిగ్రీ జూనియర్ కళాశాలల్లో గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేస్తూ ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికై పాటు పడుతున్నామని తెలంగాణ గౌట్ కాలేజి లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ అన్నారు. ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ జీఓ జారీ చేసినప్పటికి అనివార్య కారణాల వలన క్రమబద్దీకరణ ఇంత వరకు జరగలేదని 2017, 10వ పిఆర్సి ప్రకారం కాంట్రాక్టు లెక్చరర్స్ వేతనాలు పెంచడం జరిగిందని, ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్లకు గతంలో సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ ప్రకారం క్రమబద్దీకరణ జరిగేందుకు 12 నెలల వేతనం, హెచ్‌ఆర్‌ఎ, డిఎ చెల్లిస్తూ ప్రతి నెలా వేతనాలు సక్రమంగా చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాలుగా బదిలీలు లేక ఒకే చోట పనిచేస్తూ కుటుంబ సమస్యలను ఎదుర్కొంటున్న కాంట్రాక్టు లెక్చరర్ల ఇబ్బందులను పరిశీలించి కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలన్నారు. న్యాయస్థానంలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ త్వరగా పరిష్కారం అయ్యేటట్లు చూడాలన్నారు. గతంలో పనిచేసి వివిధ కారణాలతో డిస్టప్ అయి డిగ్రీ, జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లను తిరిగి ఖాళీలలో అవకాశం కల్పించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో గునగంటి వెంకటేశ్వర్లు, కె.శ్రీనివాస్, సిహెచ్ కృష్ణ, జి.సైదులు, పూర్ణ చందర్, ఝాన్సీ, మాధవి, లలిత, లింగరాజు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments