Home తాజా వార్తలు రాజకీయ పార్టీల ఖర్చులను నియంత్రించాలి: వినోద్

రాజకీయ పార్టీల ఖర్చులను నియంత్రించాలి: వినోద్

Great success of Telangana is MP Vinod

ఢిల్లీ: పార్టీల వారిగా అందరి అభిప్రాయాలను ఇసి స్వీకరించిందని ఎంపి వినోద్ తెలిపారు.  ఇవిఎంలు, వివిప్యాట్ మెషిన్లతో సమస్యలు ఉన్నాయని పలు రాజకీయ పార్టీలు తెలపడంతో వారితో ఎన్నికల సంఘం చీఫ్ ఒపి రావత్  సమావేశమయ్యారు.   అనంతరం వినోద్ మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఎంఎల్‌సి ఎన్నికలలో గరిష్ట ఖర్చు నిబంధన పెట్టాలని కోరారు. రాజకీయ పార్టీల ఖర్చులను నియంత్రించాలని, జాతీయ పార్టీల ఖర్చును నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల రోజు ప్రకటనలపై దృష్టి సారించాలని ఇసిని కోరారు.