Home పెద్దపల్లి మృత్యు రహదారి

మృత్యు రహదారి

Control over the speed at which the speed is exceeded

ఏటా వేలాది మంది మృత్యువాత
మితి మీరిన వేగంపై నియంత్రణ కరువు
సుల్తాన్‌బాద్ ప్రమాదంలో నలుగురి మృతి
రహదారిపై కొరవడిన నిఘా

మనతెలంగాణ/పెద్దపల్లి: రాజీవ్ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమా దాల్లో ప్రజలు పిట్టల్లా రాలి పోతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పె ద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఒకే కు టుంబానికి చె ందిన 4గురు మరణించారు. మంథని పట్టణంలో కృష్ణవేణి ట్యాలెంట్ స్కూ ల్ యజమాని అతని భార్య ఇద్దరు పిల్లలు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.ఇదే కాట్నపల్లిలో నెల రోజుల క్రితం లారీ ప్రమాదం లో మంథని జేఎన్‌టియూసి విద్యార్థి మృతి చెందాడు. తరుచూ జరుగుతు న్న రోడ్డు ప్రమాదాలు రాజీవ్ రహదారి భద్రతా నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రమాదకరమైన మలుపులు,వంతెనలు,జన సమ్మర్దన ప్రదేశాల వద్ద సైతం భారీ వాహనాలు రోడ్డు నిర్మాణ ప్రమాణాలకు మించి వేగంగా వెళ్లడం, ప్రయాణంలో తగు జాగ్రత్తలు తీసుకోక పోవడం తదితర కారణాలు వెరసి ఈ రహదారి మృత్యు రహదారిగా మారుతోంది. 100 కిలోమీటర్ల వేగానికి తగ్గట్టుగా డిజైన్ చేశామని ఆర్‌అండ్‌బి అధికారులు చెపుతున్నప్పటికి ఆ స్థాయిలో ప్రమాణాలు లేవని నిపుణులు చెబుతున్నారు. శామీర్ పేట్, రా మగుండం ప్రాంతాలలో సాలీనా 100కు పైగా ప్రమాదా లు జరుగుతున్నాయని పోలీస్ గణాంకాలు చె బుతున్నాయి.–సుల్తానాబాద్ ప్రమాదానికి స్థానికంగారహదారి వెంట నిఘా లేక పోవడమేనని భావిస్తున్నారు. సుల్తానా బాద్ శాస్త్రినగర్ నుంచి కాట్నపల్లి వరకు రాజీవ్హ్రదారిని ఆనుకొని ఇరువైపుల ఉన్న రైస్ మిల్లులకు వ చ్చిపోయే లారీలు రోడ్డుపై ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ చేస్తున్నా స్థానిక పోలీసులు చూసిచూడనట్లు వ్యవ హరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రధాన రహదారుల వెంట వాహనాల పార్కింగ్ నిషేధం అయినప్పటికి కనీసం ఇండికేటర్లు వేయకుండా యథేచ్ఛగా పార్కింగ్ చేస్తున్నారు.
కాట్నపల్లిలో జ రిగిన సంఘటనలో ఆగి ఉన్న లారీకి రాత్రి2.30 గంటల ప్రాంతంలో కారు ఢీకొట్టడంతో ప్రమాదం జ రిగింది.రాత్రి పూట పెట్రోలింగ్ చేస్తున్న స్థానిక పోలీస్ బృందం సక్రమంగా తమ విధులను నిర్వహించి ఉ ంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు.
శాస్త్రినగర్ నుంచి కాట్నపల్లి వరకు దాదాపు 4కిలో మీటర్ల పొడవు రాజీవ్ రహదారిలో ఒకే ఒక యూ టర్న్ ఉండడంతో కుడి, ఎడమ వైపున ఉన్న రైస్ మిల్లుల నుంచి వచ్చే వాహనాలు లెఫ్ట్‌లో ముందుకెళ్లి యూటర్న్ తీసుకోకుండా 2,3కిలోమీటర్ల దూరాన్ని తగ్గించుకోవడానికి రాంగ్ రూట్లో వెళ్తు ప్రమాదాలకు కారకులవుతున్నారు.ఈ వ్యవహారంపై పోలీసులకు స్పష్టమైన అవగాహన ఉన్నా వాటిని నియంత్రించడంలో విఫలమవుతన్నారు. ఫలితంగా అమాయకులు బలి అవుతున్నారు. రాజీవ్ రహదారి వెంట వేగాన్ని నియంత్రించడం,పార్కింగ్ నిషేధాన్ని ఖచ్చితంగా అమలు జరపడం, రాంగ్ రూట్లో వెళ్లే వాహనాలపై కొరడా ఝులిపించినట్టయితే కొంత వరకైనా ప్రమాదాలను నియంత్రించ వచ్చు.