Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

పతాక ప్రదర్శనలో వివాదం

REPUBLIC

జగిత్యాల: పట్టణంలోని చారిత్రక కట్టడమైన ఖిల్లాలో గురువారం నిర్వహించిన 68వ గణతంత్ర వేడుకల్లో కొం దరు వ్యక్తులు మతపరమైన జెండాను ప్రదర్శించడంతో వివాదం రాజుకుంది. కలెక్టర్ ప్రసంగం తర్వాత వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శనలో భాగంగా విహెచ్‌పికి చెం దిన కొందరు వ్యక్తులు జాతీయ జెండాతో పాటు జై శ్రీరామ్ అని రాసి ఉన్న జెండాను ప్రదర్శించడంతో అక్కడే ఉన్న మరో వర్గానికి చెందిన వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. తమ మతానికి సంబంధించిన జెండాను కూడా ప్రదర్శించేందుకు ముందుకు రాగా అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో పోలీస్ స్టేషన్‌లోకి చొచ్చు కెళ్ళే ప్రయత్నం చేయగా డిఎస్‌పి కరుణాకర్, పోలీసు బలగాలను దింపి గట్టిబందోబస్తు నిర్వహించారు.

Comments

comments